కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈనెల 9న చాపర్‌లో వచ్చారు. సభలో మాట్లాడి వెళ్లిపోయారు. అంతకుముందు అదే చాపర్‌ నుంచి ఓ నల్లటి ట్రంకు పెట్టెను భద్రతా అధికారులు బయటకు తీసి ప్రైవేటు కారులో రహస్యంగా తరలించారు. ఇది జరిగి ఐదారు రోజులైంది. అయితే ఇప్పుడా వీడియోను కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. పెట్టెలో ఏముందో దర్యాప్తు చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌, జేడీఎస్‌ డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారంపై మోదీ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ సవాలు విసిరారు. పెట్టెలో డబ్బు లేనట్లైతే దర్యాప్తునకు సిద్ధంగా ఉండాలన్నారు.

blackbox 19042019

ప్రధాని, మంత్రులు ఎన్నికల ప్రచారానికి వెళ్లే వాహనాలను ఈసీ పరిశీలించాలని కోరారు. అటు కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా ట్రంకు పెట్టెలో ఏముందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ట్రంకు పెట్టెను తరలించిన ఇన్నోవా ఎవరిది? దీనిపై ఎన్నికల కమిషన్‌కు ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. అయితే దీని పై ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. నల్లటి ట్రంకు పెట్టె కేవలం ప్రధాని భద్రతాపరమైన వస్తువులకు సంబంధించినదిగా గుర్తించామని చిత్రదుర్గ జిల్లా అధికారి వినోద్‌ ప్రియ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు దీనిపై తాము విచారణ చేపట్టామన్నారు.

blackbox 19042019

ప్రధాని మోదీ ఈనెల 9న కర్ణాటకలోని చిత్రదుర్గ పర్యటన సందర్భంగా ఓ నల్లటి పెట్టె తరలింపుపై వివాదం చెలరేగిన విషయం విదితమే. ప్రధాని వచ్చిన హెలికాప్టర్‌ నుంచి ఆ పెట్టెను ఇన్నోవా కారులో చేరవేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. కాంగ్రెస్‌ పార్టీ దానిలో ఏముందో వెల్లడించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారి వినోద్‌ ప్రియ వివరణనిస్తూ ‘ప్రధాని దిగిన ప్రాంతంలోని అన్ని వాహనాలను పరిశీలించాం. హెలికాప్టర్‌ను తనిఖీ చేసేందుకు ఎస్పీజీ అనుమతి ఇవ్వలేదు. పెట్టెను తరలించిన ఇన్నోవా కారు, దాని డ్రైవర్‌ను విచారించాం. ఆ డ్రైవర్‌ చెప్పిన ప్రకారం ఈ పెట్టె భద్రతాపరమైన వస్తువులకు సంబంధించింది...’ అని ఆమె వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read