వచ్చే ఏడాది అంతర్జాతీయ పోటీలకు ఆతిధ్యం ఇవ్వనుంది అమరావతి. విజయవాడ కృష్ణాతీరంలో ఫార్ములా వన్ తరహాలో పవర్ బోటింగ్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదించింది.

తొలిసారిగా పీ-వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలు, నదిలో నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే పోటీలలో ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులు వస్తారు.

ఈ భారీఈవెంట్‌పై నిర్ధిష్ట కార్య ప్రణాళికతో రావాలని నిర్వాహకులకు ముఖ్యమంత్రి సూచించారు. నదీతీరాన నిలబడి పోటీలను 30 మీటర్ల రేంజ్‌లో చాలా స్పష్టంగా చూసేందుకు అవకాశం ఉండాలని చెప్పారు.

పదిరోజుల పోటీలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని సీయం సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read