ఇబ్రహీంపట్నంలో ఫెర్రీ పాయింట్ దగ్గర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు తిరగబడింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 12మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు జరుగ్తున్నాయి...
కాగా మృతులు ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటికే ఎన్‌డిఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో పడిన 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది... చీకటి పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది... అసలు బోటు లో ఎంత మంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, అసలు ఏమిటి అనే విషయం స్పష్టత లేదు...
ఆదివారం, కార్తిక మాసం చివరి ఆదివారం కావటంతో, ఎక్కువ మంది పవిత్ర సంగమం దగ్గర హారతి చూడటానికి వచ్చారు... అయితే, అనుకోని సంఘటన జరగటంతో, పవిత్ర సంగమం ఘాట్ దగ్గర విషాద చాయలు అలుముకున్నాయి... పున్నమి ఘాట్ నుంచి పవిత్రసంగమం బయలుదేరినట్టు సమాచారం...