టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఉన్న కక్షతోనే, రాష్ట్రప్రభుత్వం, మంత్రులు రాజధానిపై దుష్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి గుండెకాయ వంటి అమరావతిని శ్మశానంతో పోల్చారని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నాడనగానే, రాష్ట్రమంత్రులు, వైసీపీనేతలు ఎందుకం తలా ఉలిక్కిపడుతున్నారని ఉమా ప్రశ్నించారు. బూతుల మంత్రిగా కొడాలినాని, బూతుల స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌ ఎనలేని పేరుప్రఖ్యాతులు పొందారని ఆయన ఎద్దేవాచేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా బూతులు తిట్టడానికి ఒకశాఖను సృష్టించి, అందుకు ఒక మంత్రిని నియమిస్తే బాగుంటుందని బొండా దెప్పిపొడిచారు. ప్రజాస్వామ్యం లో చట్టసభల్ని దేవాలయాలుగా చూస్తారని, అటువంటి సభను నడిపేవ్యక్తే తానేం మాట్లాడుతున్నాడో తెలుసుకోకుండా పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మౌనం వహించడం దారుణమన్నారు.

bonda 27112019 2

దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా, స్పీకర్‌స్థాయిలో ఉన్న వ్యక్తి నీచమైనపదజాలం వాడుతున్నాడన్నారు. అసెంబ్లీలోనే సభాపతి పదజాలాన్ని, ఆయన భాషను నిలదీస్తామని బొండా తేల్చిచెప్పారు. ప్రధానిమోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని చంపేసిన రాష్ట్రప్రభుత్వం, మంత్రులతో నీచమైన భాషను మాట్లాడిస్తోం దన్నారు. అమరావతి సందర్శనకు పందులు, దున్నపోతులు వస్తున్నాయని చెబుతున్న కొడాలినాని, ఆ పందులు, పశువుల సంఖ్య 150అని చెప్పడం మరిచిపోయాడని బొండా ఎద్దేవాచేశారు. ఐదుకోట్లప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకైన అమరావతిని కేవలం ఒకసామా జిక వర్గానికే పరిమితం చేయడం, ప్రజారాజధానిని శ్మశానంతో పోల్చడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీనేత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒకవర్గంపై ఉన్న కక్షతో, వారిని అణచివేయాలన్న దుర్భుద్ధితోనే జగన్‌ అమరావతి నాశనానికి పూనుకున్నాడని ఉమా ధ్వజమెత్తారు. అధికారపార్టీనేతల అహంకా రంతో, చేతగానితనంతో అంకురదశలో ఉన్న రాష్ట్రం అధోగతిపాలైందన్నారు.

bonda 27112019 3

టీడీపీ ప్రభుత్వం అమరావతిలో శాసనసభ, మండలి, సచివాలయం, హైకోర్టుని నిర్మించడంతో పాటు, రోడ్లఏర్పాటు తోపాటు, ఇతర భవనాలు, పార్కులనిర్మాణాలను తుదిదశకు చేర్చి, ఉద్యోగులకు, పేదలకు అవసరమైన నివాససముదాయాల నిర్మాణాన్ని కూడా 90శాతం వరకు పూర్తిచేయడం జరిగిందన్నారు. అమరావతి నిర్మాణంలో రెండులక్షల కోట్ల అవినీతి జరిగిందని విషప్రచారంచేసిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక, రూ.2లక్షల అవినీతిని కూడా రుజువు చేయలేకపోయిందన్నారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని గగ్గోలుపెట్టిన జగన్‌, అధికారం లోకి వచ్చి 6నెలలైనా ఒక్క గజంభూమికూడా అన్యాక్రాంతం అయినట్లు నిరూపించలేకపో యిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ అహంకారాన్ని, అజ్ఞానాన్ని, అసమర్థతను రాష్ట్రప్రజలకు తెలియచేయడానికే మాజీముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నాడని బొండా స్పష్టంచేశారు. ప్రాణసమానంగా చూసే భూమిని రాజధాని కోసం రైతులు త్యాగంచేస్తే, జగన్‌ప్రభుత్వం వారిని హీనంగా చూస్తోందన్నారు. రాజధాని ప్రాంతంపై దుష్ప్రచారం చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కిరాయివ్యక్తుల్ని నియమించాడన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read