జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి అనేకమైన జిమ్మిక్కులు చేస్తోందని టీడీపీ నేత, బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 9నెలల క్రితం ప్రతిపక్షంలో ఉన్న వైపీపీ తెలుగుదేశంపార్టీ రూ.2లక్షల కోట్లు అవినీతి చేసిందని పుస్తకం వేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియర్ అధికారులతో మాపై కమిటీ వేస్తే మేము సిట్టింగ్ జడ్జితో కమిటీ విచారణ చేయమని తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే తోక ముడిసి మంత్రులతో సబ్ కమిటీ వేశారని వివరించారు. ఇప్పటికి కమిటీ వేసి 9 నెలలు అవుతున్న కొండను తొవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని పిటర్ కమిటీ వేశారు.. పిటర్ పీకింది ఏమి లేదన్నారు. ఇప్పుడు సీట్ అంటున్నారు. ఈ 9నెలల్లో విశాఖలో అక్రమం కొట్టివేసిన భూములను, ఇసుక మాఫీయా, మద్యంలో జే ట్యాక్స్ పై కూడా సీట్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దోచేసినా రూ.21వేల కోట్లపై కూడా సీట్ విచారణ వేయాలి. గతంలో మీరు చేసిన అవినీతి వలన ఉన్నత అధికారులు జైలు పాలైన సందర్భం ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మిలీనియం టవర్స్ కు కేబినేట్ లో రూ.19 కోట్లు కేటాయించి హడవిడి చేశారు.
విశాఖ నేవీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం జరిగిందన్నారు. 9నెలల్లో రాష్ట్రంలో అభివృద్ది చేసిన పని ఒకటి లేకపోగ నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి తరలింపు, విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్, ఇన్ సైడ్ ట్రేడింగ్ ఇవన్ని కూడా ప్రజల దృష్ట మళ్లించడం కోసమేనని అన్నారు. రస్ అల్ ఖైమా ప్రాజెక్టులో వాన్ పిక్ కు సంబంధించిన నిమ్మగడ్డ ప్రసాద్ రూ.870కోట్లు కొట్టివేయడం జరిగిందన్నారు. 14మందితో సీబీఐ విచారణ జరగడం జరిగిందన్నారు. ఆ కుంభకోణంలో మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి, ధర్మాణ ప్రసాద్ వీరందరూ 16నెలలు జైలు లో ఉండి వచ్చిన వ్యక్తులు. సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్, జగన్మోహన్ రెడ్డి జైలుమేట్ గురించి ఎందుకు దాని గురించి మాట్లాడారు. రస్ అల్ ఖైమాలో 2012లోనే కేసులు నమోదు అయిందని తప్పించుకొని తిరుగుతున్నారని సెర్బియా లో అరెస్టు చేయడం జరిగిందన్నారు. రస్ అల్ ఖైమా అంతర్జాతీయ కోర్టులో రూ.50వేల కోట్లుకు సంబంధించి నిమ్మగడ్డను అరెస్టు చేయడం జరిగిందన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు..ప్రధాని మంత్రి, అమిత్ షాను కలిశారు..కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజానాల కోసం కలిశానని ఒక్క కూడా మాట్లాడలేదు. యునిటేడ్ అరబ్ కు మన దేశానికి ఉన్న పరస్పర సహకార పూర్వ భూభాగం ఒప్పదం ప్రకారం నేరస్తులను అప్పజేప్పుకోవడం జరుగుతున్నాయి. హిందు సంస్థలకు చెందిన శ్యామ్ ప్రసాద్ కూడా జగన్ కు జైలుమేటేనన్నారు. ఆ కేసులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అందువలనే జగన్మోహన్ రెడ్డి ప్రధాని కల వడం జరుగుతోందన్నారు. చరిత్రలో ముఖ్యమంత్రిపై అంతర్జాతీయ కోర్టు నోటీసులు ఇచ్చిన సందర్భం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజిట్ నోటీఫికేషన్ లో యుఐఐ కోర్టు ఉత్తర్వులకు భారతదేశం ప్రభుత్వం అంగీకారం తెలిపారని తెలియజేశారు. కోర్టు ఆఫ్ ఇంటర్ నేషనల్ ఫైనాల్స్, కోర్టు ఆఫ్ అబిదబీ గ్లోబల్, అబిదబీ జ్యూడిషియల్, దుబాయ్ కోర్టులు, రస్ అల్ ఖైమా జ్యూడిషియల్ డిపార్ట్ మెంట్ సంబంధించి అక్కడ అమలు చేసే శిక్షలకు అంగీకరం తెలిపారు.
వాటిని దృష్టి మళ్లిండం కోసమే సీట్ కమిటీ వేశారని విమర్శించారు.
నిమ్మగడ్డ ప్రసాద్ ను విడిపించడ కోసమే జగన్మోహన్ రెడ్డి ఒక టీమ్ ను రస్ అల్ ఖైమా పంపించారని అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ జీవితం సెర్బియా కే పరిమితి అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గజిట్ నోటీసు వైసీప నాయకుల్లో వణుకు పుడుతుందన్నారు. వైసీపీ నాయకులు చేసిన పాపాలు తుది దశకు వచ్చాయని అన్నారు. వాన్ పిక్, దిహిందు పేరుతో మా దేశానికి వచ్చి రూ.50వేల కోట్లు దోచుకున్నారని రస్ ఆల్ ఖైమా 2013లోనే కేసులు పెట్టిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ కేసు నుంచి తప్పించుకోవడం కుదరదన్నారు. జగన్మోహన్ రెడ్డి రస్ ఆల్ ఖైమా పై సమాధానం చెప్పి సిట్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో డ్రోన్ ఉపయోగించడం మరియు మహిళలు చేస్తున్న బంద్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి బెదింపులకు భయపడేది లేదని హెచ్చరించారు.