ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వం చర్చలు ఇంకా ఇంకా ఇంకా సాగుతూనే ఉన్నాయి. గతానికి భిన్నంగా ఉద్యోగ సంఘాలు వేడుకునే ధోరణిలో ప్రభుత్వం ముందు మోకరిల్లారు. ఈ రోజు కూడా ప్రభుత్వం ముందు చర్చలకు వెళ్ళారు. చర్చలు తరువాత ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతాలకు 33 శాతం ఖర్చు పెడుతున్నారని, కానీ వందశాతమని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చాయని ప్రభుత్వం అంటోందని అన్నారు. ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందని, తమ సమస్యలు ఏమి పరిష్కరించటం లేదని అన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను యథావిధిగా అమలు చేయాలని ఆయన తెలిపారు. ఎన్నిసార్లు చర్చలకు పిలిచి అవమానించినా వస్తూనే ఉన్నాం అని అన్నారు. ఈ విధమైన చర్చలు గతంలో ఎప్పుడూ జరగలేదని, తమను సీఎం దగ్గరకు తీసుకెళ్తే ఆయనతోనే మా సమస్యలు చెప్పుకుంటాం అని అన్నారు. రూ.6 వేల కోట్లు సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు ఉన్నాయని, మాకు డబ్బులు ఇవ్వకుండానే ట్యాక్స్‌లు కట్ చేసుకున్నారని అన్నారు. ట్యాక్సులు కట్ చేసుకోడానికే డీఏ ప్రకటించారని సంచలన వ్యాఖ్యలు చేసారు. పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దుపై సీఎం స్పష్టత ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేసారు.
ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొప్పరాజు..
Advertisements