ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తుంది, ఉద్యోగులకు జీతాలు పడటం లేదు అనే విషయం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13వ తేదీ వచ్చినా చాలా మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు పడటం లేదు. ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ ది కూడా అదే పరిస్థితి. అప్పు పుట్టటం లేదు, వస్తున్న ఆదాయం వస్తున్నట్టు రిజర్వ్ బ్యాంకు ఓడి కింద జమ వేసుకుంటుంది. ఈ తరుణంలో ఈ రోజు ఉద్యోగులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తమకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, చివరకు ఇప్పుడు జీతం ఇస్తే చాలు అనే పరిస్థితికి తీసుకొచ్చారని, మాకు రావలసిన బకాయల మేము అడగకుండా, కుట్ర ప్రకారం జీతం ఆపేసి, జీతం ఇస్తే చాలు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు. జీతాల కోసం కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, రోడ్డుకు వచ్చి పడ్డాం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో అర్ధం కావటం లేదని అన్నారు. మేము దాచుకున్న డబ్బులు కూడా వాడేసారని, ఇప్పుడు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read