రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల హడావిడి వచ్చిన దగ్గర నుంచి, ఉద్యోగు సంఘాలను ముందుకు పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. ముఖ్యంగా వెంకట్రామి రెడ్డి అనే ఉద్యోగ సంఘం నాయకుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒక రాజకీయ నాయకుడి లాగా మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల పైన, నేతల పైన రాజకీయ విమర్శలు చేసే దాకా వెళ్లారు. అంతే కాదు, రాజ్యంగ పదవిలో ఉన్న ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు, ఏకంగా మాకు ప్రాణ హాని ఉంటే, ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వెంకట్రామి రెడ్డి చేసిన ఓవర్ ఆక్షన్ కి, ఆయన చరిత్ర తవ్వని తెలుగుదేశం పార్టీ, ఆయన భార్య ముషీరాబాద్ లో 2014లో ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేద్దామని అనుకుని, ప్రచారం చేసిన ఫోటోలు, వీడియోలు బయట పెట్టి, వెంకట్రామి రెడ్డి వైసీపీ కార్యకర్త అనే వ్యాఖ్యలు చేసారు. వెంకట్రామి రెడ్డి, ఎన్నికల కమీషనర్ పై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఏకంగా సుప్రీం కోర్టు కూడా, ఎన్నికల పిటీషన్ గురించి విచారణ సమయంలో, ఉద్యోగులు వేసిన పిటీషన్ గురించి, న్యాయవాది కలుగ చేసుకోగా, జడ్జి తీవ్రంగా స్పందించారు. మీ ఉద్యోగుల ఓవర్ ఆక్షన్ చూస్తున్నాం, మీరు ఏకంగా ఎన్నికల కమీషనర్ పైనే వ్యాఖ్యలు చేస్తారా, మాట్లాడకండి అంటూ ఘాటుగా స్పందించింది సుప్రీం కోర్టు.
అయితే ఇప్పుడు వెంకట్రామి రెడ్డి తీరు పై ఉద్యోగులు రెండుగా చీలి పోయారు. ఏపీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పై, అమరావతి ఉద్యోగుల జేఏసీ ఈ రోజు సమావేశం అయ్యి, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వెంకట్రామి రెడ్డి వైఖరితో, ఉద్యోగులు పలుచన అయిపోయారని, అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిని కింద స్థాయి ఉద్యోగులతో సంబంధాలు లేవని, వెంకట్రామిరెడ్డి వైఖరి పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం అని బొప్పరాజు అన్నారు. వెంకట్రామిరెడ్డి వైఖరితో ఉద్యోగులకు భరించలేని స్థితిలోకి వేల్లిపోయారని, అందుకే వెంకట్రామిరెడ్డి పై, వివిధ ఉద్యోగుల సంఘాలు ఆవేదన చెందుతున్నాయని అన్నారు. సచివాలయంలో, ఇంత మందే రావాలి, అంత మందే రావాలి అంటూ వెంకట్రామి రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అయితే దీని పై స్పందించిన వెంకట్రామిరెడ్డి, నా పైన అందరూ కలిసి కుట్ర పన్నారని, ఇన్ని రోజులు జరిగిన దానికి, ప్రజల్లో ఉద్యోగుల పై వచ్చిన వ్యతిరేకత మొత్తం నా పైన మళ్ళించే కుట్ర చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి అన్నారు.