బోరుగడ్డ అనిల్.. క్రిస్టియన్ సంస్థలతో సంబంధాలు నడుపుతూ హిందూ ధార్మిక సంస్థలలో కీలక వ్యక్తులతో రాజకీయాలు నడుపుతాడు. వైఎస్ జగన్ రెడ్డికి బంధువుని అని కూడా చెబుతుంటాడు. వాళ్లను చంపుతా, వీళ్లని వేసేస్తా అనే బోరుగడ్డ అనిల్ దగ్గర మేటర్ నిల్. ఆయన బలమూ, బలగమూ అంతా వైసీపీ పెద్దలే. జగన్ కళ్లలో ఆనందం చూసేందుకు బోరుగడ్డ అనిల్ దాడులు చేస్తాడు, కేసులు వేస్తాడని ఆయన గురించి తెలిసిన వారు చెప్పే మాట. బోరుగడ్డ అనిల్ ఏకంగా హోంమంత్రి పేరు చెప్పుకుని భూసెటిల్మెంట్లు చేసినట్లు అతని మీద కేసులున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ స్టేషన్‌లో అనిల్‌పై రౌడీ షీట్ కూడా ఉంది. బోరుగడ్డ అనిల్ సైమన్ అమృత్ ఫౌండేషన్ అనే క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. గుంటూరు వల్లూరివారి తోటలో.. భీంసేన పేరుతో ఓ కార్యాలయం ప్రారంభించారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖకి తానే వర్కింగ్ ప్రెసిడెంటునని ప్రచారం చేసుకుంటాడు. మోసాలు, నకిలీలలు, బెదిరింపు దందాలు, పెద్ద పెద్ద అధికార్లనే బురిడీ కొట్టించడం, కోర్టులో కేసులు వేయడం ద్వారా.. పాపులారిటీ పెంచుకోవడం, ఆ పాపులారిటీతో మళ్లీ దందాలు చేయడం, ఇలా అనేక సార్లు ఆరోపణలు ఎదుర్కుంటూ, ఆయన వార్తల్లో నిలిచాడు
బోరుగడ్డ అనిల్ చరిత్ర ఇది, 1. గతంలో అమరావతి ప్రాంతంలో.. భూదందాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కారు. 2. ఓ భూవివాదంలో డిప్యూటీ సీఎం హోమంత్రి పేరు చెప్పుకుని నేరాలకు పాల్పడ్డారు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. 3. క్రిస్టియన్ మత సంస్థను నిర్వహిస్తూ, రమణ దీక్షితులు పక్కన కూర్చుని, చంద్రబాబు పై దాడి చేసాడు.. విమర్శలు కురిపించారు. 4. జగన్ కోడి కత్తి కేసులో కూడా అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు. 5. మాజీ స్పీకర్ కోడెల మృతిపై ఒక కేసు వేశారు. 6. కేంద్ర మంత్రి ఓఎస్డీ అంటూ, ఐఏఎస్ ఆఫీసర్ ని అంటూ మారు పేర్లతో దందాలు చేసే వాడనే ఆరోపణలు, కేసులు కూడా ఉన్నాయి. 7. శ్రీ వారి నగలు మాయం అయ్యాయని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుతో నాటి టిడిపి ప్రభుత్వంపై ఆరోపణలు దగ్గరుండి చేయించింది బోరుగడ్డ అనిల్. 8. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రమణపై పిల్ వేసింది కూడా ఈ బోరుగడ్డ అనిలే..