చిత్రవిచిత్రాల కలబోతగా బోస్టన్‌కమిటీ, జీ.ఎన్.రావుకమిటీ నివేదికలున్నాయని, వాటిని ఆధారంగా చేసుకొని ప్రజారాజధాని అమరావతిని చంపేయడానికి జగన్ కంకణం కట్టుకున్నాడని టీడీపీనేత, ఆపార్టీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు అనుకూలంగా తప్పుడు నివేదికలు తయారుచేయడం కోసం, ఏవిధమైన జీవోలు లేకుండా రూ.6కోట్ల ప్రజలసొమ్ముని ఒకలేఖద్వారా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం బదలాయించిందన్నారు. బోస్టన్‌కన్సల్టింగ్ గ్రూప్‌సాయంతో బోగస్‌నివేదికను తయారుచేయించిన జగన్మోహన్‌రెడ్డి, ముందుగానే తామనుకున్నదే నివేదికల్లో వచ్చేలా చేసి, రాజధానిని మూడుముక్కలు చేసేకుట్రకు తెరలేపాడన్నారు. బీసీజీ నివేదికలోని పేజీనెం-72, పేజీ.నెం-92, 8, 78, 84ల్లో చెప్పిన అంశాలను పరిశీలిస్తే, దానిలోని డొల్లతనంఏమిటో, ఎన్ని అబద్ధాలుచెప్పారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. పేజీ-72లో అమరావతిని ముంపుప్రాంతంగా చిత్రీకరిస్తూ, అందుకు ఆధారంగా చెన్నైఐఐటీ నివేదిక ఇచ్చినట్లుగా చూపడం జరిగిందన్నారు. ఒక రాష్ట్రముఖ్యమంత్రి, రాజధాని అమరావతిని చంపేయడంకోసం తప్పుడునివేదికల్ని నమ్ముకోవడం ఇక్కడే చూస్తున్నామన్నారు.
చెన్నైఐఐటీడీన్ డాక్టర్.రవీంద్ర.గెట్టు చాలా స్పష్టంగా అమరావతిపై తాము ఎలాంటి అధ్యయనంచేయలేదని, తమ సంస్థనుంచి తాము ఎలాంటి నివేదికలు ఎవరికీ ఇవ్వలేదని మెయిల్‌ద్వారా చెప్పడం జరిగిందన్నారు. వైసీపీప్రభుత్వం మాత్రం తమస్వార్థంకోసం ఐఐటీచెన్నైపేరుని కూడా మంటగలిపేందుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. విజయసాయిరెడ్డికి అత్యంతసన్నిహితుడు, సత్యవాణిప్రాజెక్ట్స్ , కన్సల్టెంట్స్‌కి చెందిన పీ.సూర్యప్రకాశ్ అనేవ్యక్తి ఐఐటీపేరుతో నకిలీనివేదికలు సృష్టించాడని, వాటిని అడ్డంపెట్టుకొని జగన్‌సర్కారు కుటిలయత్నాలకు తెరలేపిందని పట్టాభి మండిపడ్డారు. ఒకరాష్ట్రప్రభుత్వం ఐఐటీమద్రాస్ సంస్థనుకూడా భ్రష్టుపట్టించేలా వ్యవహరించిందన్నారు. ఏ1, ఏ2లకు నేరాలు చేయడం అలవాటుగా మారిందని, దానిలోభాగంగానే ఐఐటీచెన్నైపేరునికూడా దుర్వినియోగం చేశారన్నారు. ఏసంస్థ పేరుచెప్పి, అమరావతి ముంపునకు గురవుతుందని ప్రచారంచేశారో,అదేఐఐటీ చెన్నై సివిల్‌ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఏ.మెహెర్‌ప్రసాద్ సీఆర్డీఏలో జరిగే నిర్మాణాలన్నీ సురక్షితమని నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. (సదరు నివేదికను పట్టాభి విలేకరులకు చూపించారు.) మంత్రులు బొత్స, బుగ్గన, తదితరులు ఏ ఐఐటీచెన్నై నివేదిక గురించైతే మాట్లాడుతున్నారో, ఆ నివేదికను బయటపెట్టాలని, పట్టాభి డిమాండ్‌చేశారు. ఏపీప్రభుత్వతీరు సహించలేక ఐఐటీచెన్నైకి చెందిన పూర్వవిద్యార్థులు కొందరు, తమసంస్థను బదనాంచేయడంపై ఇప్పటికే కోర్టుని ఆ శ్రయించారని టీడీపీనేత తెలిపారు.
బీసీజీనివేదికలోని పేజీ-92లో జీఎన్.రావు కమిటీ మాదిరే విశాఖనగరానికి తుపాన్ల ముప్పుందని, అక్కడవిపత్తులు వచ్చే అవకాశం ఎక్కువని చెప్పడం జరిగిందన్నారు. విశాఖనగరాన్ని కించపరిచారంటూ టీడీపీ కార్యాలయం వద్దకువచ్చి, చిందులుతొక్కిన వైసీపీకార్యకర్తలంతా, తమప్రభుత్వం నియమించిన కమిటీల్లో ఉన్న వాస్తవాలను తెలుసుకుంటే మంచిదన్నారు. వైసీపీకార్యకర్తలకు నిజంగా విశాఖపై ప్రేముంటే, వారు తమప్రతాపాన్ని టీడీపీనేతలపై, వారిపార్టీ కార్యాలయాలపై చూపకుం డా జగన్మోహన్‌రెడ్డిపై చూపాలని పట్టాభి హితవుపలికారు. పేజీనెం-8లో ముంబై, షెంజెన్ నగరాలను ప్రస్తావించారని, అమరావతి నగరానికి విజయవాడ, గుంటూరు నగరాలు గేట్‌వేలుగా ఉన్నాయనే విషయాన్ని వారెందుకు మర్చిపోయారన్నారు. షెంజన్, నవీముంబైల మాదిరే అమరావతి కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధిస్తుందన డంలో ఎటువంటి సందేహం లేదన్నారు. పేజీనెం-74లో అమరావతికి సమీకరించిన భూములవిలువను ఎకరా రూ.కోటిగా పేర్కొన్నారని, బుర్రలేని, బుద్ధితక్కువ మంత్రులు అసెంబ్లీలో మాత్రం ఆర్బీఐవారు ఎకరం రూ.4కోట్లకు కొన్నారని, ఎస్బీఐవారు కొన్నారని ఎలా చెప్పారన్నారు. ఒకవైపు నివేదికలో మాత్రం ఎకరా రూ.కోటి అనిప్రచారంచేస్తూ, బయటమాత్రం ఇంకోలా మాట్లాడుతున్నారని పట్టాభి దుయ్యబట్టారు. మంత్రులుచెప్పిన ట్లుగా ఎకరం రూ.4కోట్లకు లెక్కేసినా, మిగులుభూముల విలువ రూ.40వేలకోట్లుంటు ందని, నగరం అభివృద్ధి చెందేకొద్దీ, ఆ భూములవిలువ మరింత పెరుగుతుందన్నారు.
కేబినెట్‌లో ఉన్న బ్యాంకాక్ మంత్రి బొత్స, అప్పుడప్పుడూ బ్యాంకాక్‌కు వెళ్తుంటారని, ఆనగరం కూడా నదిఒడ్డునే ఉందన్న విషయం ఆయనకు తెలీదా అన్నారు. పేజీనెం -78లో అమరావతిలోని 33వేల ఎకరాల భూములను అగ్రికల్చర్‌జోన్‌గా మారిస్తే, ప్రభుత్వానికి రూ. 200నుంచి రూ.300కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారని, లక్షకోట్ల సంపద (జీడీపీరూపంలో) సృష్టించే నగరాన్ని వందలకోట్లకే పరిమితం చేయాలన్న వైసీపీఆలోచన మరెవరికీ రాదన్నారు. పేజీనెం-84లో జర్మనీకి మూడురాజధానులున్నా యని చెప్పారని, ఈ విషయం జర్మనీప్రభుత్వానికి తెలిస్తే, జగన్‌ను అంతర్జాతీయకోర్టు ల్లో నుంచోబెడతారన్నారు. గతంలో ఈస్ట్‌జర్మనీ, వెస్ట్‌జర్మనీ ఉండేవని, అవిరెండూ కలిసిపోయి దశాబ్దాలవుతోందన్నారు. భారతరాజ్యాంగంలో రాజ్యాంగం అన్నపదమే లేదని చెప్పినప్పుడే జగన్ జ్ఞానం ఎలాంటిదో అందరికీ అర్థమైందన్నారు. అలానే విశాఖలో సామాజికవసతులున్నాయని, అమరావతిలో అటువంటివి కల్పించాలంటే, నిర్మాణానికి అయ్యేఖర్చులో 70శాతం అందుకే అవుతుందని చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి ,ప్రజలకు అవసరమైన సామాజికసదుపాయాలన్నీ ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం లేదనే విషయాన్ని గ్రహించకపోవడం విచారకరమన్నారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, షాపింగ్‌కాంప్లెక్సులు, హోటళ్లు వంటివాటిని ప్రైవేట్‌వ్యక్తులే ఏర్పాటుచేస్తారన్నారు. జీఎమ్‌ఆర్, జీవీకే వంటి కాంప్లెక్సులు ఎవరుకట్టారో జగన్‌కు తెలియదా అని, వాటిని అడ్డంపెట్టుకొని రూ.6కోట్లకు కక్కుర్తిపడి రాజధానిని ఎలా తరలిస్తారని పట్టాభి నిలదీశారు.