ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో, ఎప్పుడూ చూడని సీన్స్ కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రిందట, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక, మంత్రి అనిల్ వాక్ అవుట్ చేసిన విషయం తెలిసిందే. ఒక మంత్రి వాక్ అవుట్ చెయ్యటం, ఇప్పుడే చూస్తున్నా అని లోకేష్ కూడా ఎద్దేవా చేసారు. అయితే ఆ మంత్రి మళ్ళీ తిరిగొచ్చు, లోకేష్ పై వ్యక్తిగత దాడి చెయ్యటం, దానికి లోకేష్ ఘాటుగా బదులు ఇస్తూ, మీ వెనుక ఉన్న జైలు బ్రతుకు చూసుకోండి అని చెప్పటం, ఇవన్నీ చూసాం. అయితే ఈ రోజు కూడా ఒక మంత్రి శాసనమండలి నుంచి వాక్ అవుట్ చెయ్యటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ రోజు వంతు మంత్రి బొత్సా సత్యన్నారాయణది. అధికార పక్షంగా ఉంటూ, మంత్రులుగా ఉంటూ, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాని, ఇలా వాక్ అవుట్ చేసి వెళ్ళిపోతున్నారు.
దీంతో వైసిపీ చూపిస్తున్న ఈ వింత పోకడ రాజకీయ వర్గాల్లో చర్చనీయంసం అవుతుంది. ప్రతిపక్షం వాక్ అవుట్ చెయ్యటం, ప్రభుత్వం పై నిరసన తెలపటం చూసాం కాని, ఇలా అధికార పక్షం, అదీ అందరికీ జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులు వాక్ అవుట్ చెయ్యటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు శాసనమండలి సమావేశాలు మొదలు కాగానే, రాష్ట్రంలో కరువు తాండవిస్తు ఉండటం, వర్షాలు లేక పోవటం వంటి అంశాల పై చర్చ మొదలైంది. వ్యవసాయ మంత్రి, కురసాల కన్నబాబు తన సోదరుడు హఠాన్మరణం తరువాత, ఆయన బదులుగా వ్యవసాయ బడ్జెట్ కూడా బొత్సానే చదివారు, సభలో ప్రవేశపెట్టారు. కరువు పై చర్చలో కూడా, వ్యవసాయ మంత్రి తరుపున, బొత్సా పాల్గున్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు బొత్సా సమాధానం ఇచ్చారు. అన్ని జిల్లాల నుంచి కరువు నివేదికలు తెప్పిస్తున్నామని, త్వరలోనే పూర్తీ లెక్కలు చెప్తామని అన్నారు. రాష్ట్రంలో తక్కువ వర్ష పాతం, రైతుల ఆత్మహత్యలు పై నివేదిక సిద్ధం చేస్తున్నామని అనంరు. అయితే చర్చ జరుగుతూ ఉండగానే శాసనమండలి నుంచి బొత్సా వెళ్ళిపోయారు. చర్చ పై సమాధానం ఇవ్వకుండా, కనీసం చర్చలో పాల్గునకుండా మంత్రి వెళ్ళిపోవటం పై, ప్రతిపక్షాలు ఆందోళన చేసాయి. అయితే ఆయన ఎందుకు వాక్ అవుట్ చేసారో, రికార్డుగా చెప్పలేదు. మంత్రే చర్చలో లేనప్పుడు, ఇంకా ఈ చర్చ ఎందుకని ? ప్రభుత్వం తరుపున ఎవరో ఒకరు సమస్యల పై మాట్లాడటానికి ఉండాలి కదా అని తెలుగుదేశం నేతలు విమర్శలు చేసారు. మరి ఈ వివాదం పై బొత్సా ఏమంటారో చూడాలి.