వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాష్ట్రంలో జరిగిన అవినీతి పై ఎన్నో కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావమే ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మొహన్ రెడ్డి ఏ1గా ఎన్నో కేసులు ఆయాన పై ఉన్నాయి. అయితే రాజశేఖర్ రెడ్డి హయంలో జరిగిన స్కాంల విషయంలో, జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే కాదు, అప్పట్లో అధికారంలో ఉన్న మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఎన్నో కేసులు పడ్డాయి. అందులో ఒక కేసు వోక్స్ వ్యాగన్ కేసు. చాలా కేసులు రాజశేఖర్ రెడ్డి చనిపోయన తరువాత వస్తే, వోక్స్ వ్యాగన్ కేసు మాత్రం రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్న సమయంలోనే వచ్చింది. అయితే అప్పుడెప్పుడో విచారణ మొదలైన ఈ కేసు, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. తాజాగా సిబిఐ, ఈ కేసులో, అప్పట్లో పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న బొత్సా సత్యనారాయణకు నోటీస్ పంపించింది.

cbi 25082019 2

ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మున్సిపల్‌ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గత వారం రోజులుగా జగన్ ప్రభుత్వాని ఇబ్బంది పెడుతూ, ఆయనా అమరావతి పై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తాజగా బొత్సాకు నోటీసులు రావటంతో, ఆయన మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే, కొత్తగా సిబిఐ ఇచ్చిన నోటీసుల పై బొత్సా మొదటి సారి మీడియాతో స్పందించారు. ఫోక్స్‌ వ్యాగన్‌ కేసులో తనకు సీబీఐ నుంచి నోటీసులు అందాయానే విషయం తాను మీడియాలోనే చూసానని, ఇంకా తనను కలిసి నోటీసులు ఇవ్వలేదని బొత్సా అన్నారు. వచ్చే నెల 12న రావాలని నోటీసులు ఇచ్చినట్టు మీడియాలో చూశానని, అయితే, నాకు నోటీస్ ఇస్తే, అక్కడకు వెళ్తానని, నాకు తెలిసిన విషయాలు అన్నీ చెప్తానని బొత్సా అన్నారు.

cbi 25082019 3

ఇదీ అప్పటి కేసు... విశాఖపట్నంలో జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ ఏర్పాటు చేస్తామని కొంత మంది వ్యక్తులు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసారనే కేసు నమోదు అయ్యింది. వశిష్ఠ వాహన్‌ కంపెనీ మాజీ అధికారి హెల్మట్‌ షూష్టర్‌, భారత ప్రతినిధి అశోక్‌కుమార్‌జైన్, వశిష్ఠ వాహన్‌ డైరెక్టర్లు జగదీశ్ అలగ్‌రాజా, గాయిత్రీ రాయ్‌, వీకే చతుర్వేది, జోసఫ్ వీ జార్జ్‌ దీనిలో నిందితులుగా ఉన్నారు. నాంపల్లి సీబీఐ కోర్టులో 2010లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. అయితే ఈ కేసు విషయంలో 11 కోట్ల వరకు నష్టపోవటంతో, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు పై, బొత్సాకు నోటీస్ వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read