గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎక్కడా క్లారిటీ ఇవ్వటం లేదు. జగన్ అధికారంలోకి రాగానే, అమరావతి నిర్మాణాలు ఆన్నీ ఆపేసారు. అమరావతి అంటే తమకు ప్రాధాన్యత లేదు అంటూ ఆర్ధిక మంత్రి చెప్పారు. ఇక మునిసిపల్ శాఖా మంత్రి బొత్సా సత్యన్నారాయణ అయితే, అనేక సార్లు అమరావతి పై అపోహలు కలిగించేలా మాట్లాడారు. అమరావతి ఆమోదయోగ్యం కాదని, అక్కడ నిర్మాణాలు ఖర్చు ఎక్కవ అని, రాజధాని పై కమిటీ వేశామని, వారు ఎక్కడ అంటే అక్కడే రాజధాని ఉంటుంది అంటూ, అమరావతి పై అపోహలు సృష్టించారు. గత ఆరు నెలలుగా ప్రభుత్వ వైఖరి చూసి, అమరావతి రాజధానిగా ఉండదు అని చాలా మంది అనుకున్నారు. రాజధాని రైతులు కూడా ప్రభుత్వ వైఖరి పై ఆందోళన బాట కూడా పట్టారు. అమరావతి స్మశానం అని ఒకరు, అమరావతిలో పందులు, కుక్కలు తిరుగుతాయని ఒకరు, ఇలా మంత్రులే అమరావతిని హేళన చేస్తూ మాట్లాడారు.
ఇక కేంద్రం హోం శాఖ రేలీజ్ చేసిన ఇండియా మ్యాప్ లో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పెట్టకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై పట్టించుకోక పోవటంతో, అమరావతి పై ఆశలు వదులుకున్నారు. అయితే ఏ మంత్రి అయితే అమరావతి పై అవహేళనగా మాట్లాడతారో, అదే మంత్రి ఈ రోజు శాసనమండలి సాక్షిగా అమరావతి పై క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చడం లేదంటూ లిఖితపూర్వకంగా బొత్స సమాధానం ఇచ్చారు. రాజధానిగా అమరావతిని మార్చే ఉద్దేశం ఉందా, ఈ ప్రభుత్వనిక్ ఉందా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, అమరావతి రాజధానిగా మార్చే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదు అంటూ మండలిలో ఆయన స్పష్టం చేశారు.
మంత్రి బొత్సా ప్రకటనతో, అమరావతి మార్పు పై, జరుగుతున్న ప్రచారానికి ఇక తెర పడినట్టే చెప్పాలి. నిజానికి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో అడగగానే, అమరావతిని మళ్ళీ మ్యాప్ లో వెంటనే కేంద్ర హోం శాఖ పెట్టటంతోనే, కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి పై స్పష్టమైన వైఖరి చెప్పింది. దీంతో ఇక జగన్ ప్రభుత్వానికి కూడా అమరావతిని కొనసాగించాల్సిన పరిస్థితి. రాజధానిని మార్చాలి అంటే, కేంద్రం అనుమతి కూడా అవసరమే. కేంద్రం స్పష్టంగా చెప్పటంతో, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తప్పని పరిస్థితి. ఏది ఏమైనా అమరావతి పై టిడిపి చేసిన పోరాటం ఫలించిందనే చెప్పాలి. చంద్రబాబు అమరావతిలో పర్యటించి, ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెంచారు. ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతిని గుర్తించినందుకు సంతోషం.