ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ఇసుక. దాదపుగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క రవాణా వ్యవస్థ అయిన లారీలు, టిప్పర్లు కూడా, పనులు లేక, నెలవారీ కిస్తీలు కట్ట లేక, నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క, నిర్మాణాలు మొదలు పెట్టిన వారు, నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆపేసారు. మరో పక్క, నిర్మాణ కాంట్రాక్టులు చేసే వారు, ముందు చెప్పిన రేటుకు పనులు చెయ్యలేము అని, మరింతగా కాంట్రాక్టు విలువ పెంచాలి అంటూ, ఆందోళన చేస్తున్నారు. ఇలా కూలీల దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దాకా, అందరికీ గడ్డు పరిస్థితి నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి గద్దెను ఎక్కగానే, చంద్రబాబు ఇసుక పాలసీతో దోపిడీ చేస్తున్నారని, చెప్పి, ఆ పాలసీని రద్దు చేసారు. దీంతో అసలు ఇసుక బయటకు రాకుండా, ఎక్కడికక్కడ ఆగిపోయింది. అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అంటూ, సెప్టెంబర్ 5 కొత్త పాలసీ ఓపెనింగ్ అన్నారు.

botsa 10112019 2

సెప్టెంబర్ 5 వచ్చింది, కొత్త పాలసీ వచ్చింది కాని, ఇసుక మాత్రం రాలేదు. జగన్ మోహన్ రెడ్డి, ఇసుక వారోత్సవాలు అన్నారు. అవి ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇసుక ఏది అని అడిగితే, వరదలు వచ్చాయి, వరదలు తగ్గే దాకా ఇంతే అని చెప్తున్నారు. ఒక పక్క తెలుగుదేస్, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇసుక కొరత పై ఆందోళన చేస్తూ, ఇసుకను బ్లాక్ లో అమ్ముకుని, వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారని, చెప్తుంటే, అదేమీ లేదు, ఎక్కడా ఇసుక బయటకు వెళ్ళటం లేదు, వరదల ఉన్నాయని తెలియదా అంటూ, ప్రభుత్వం సమర్ధించుకుంటూ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతుంది. సరిగ్గా ఇలాంటి టైంలో, మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలతో, ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. దీంతో, ఇప్పుడు ప్రభుత్వమే, ఇసుక బ్లాక్ లో వెళ్ళిపోతుంది అని ఒప్పుకునే పరిస్థితి. శుక్రవారం విజయనగరం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వంలో కలకలం ఏర్పడింది.

botsa 10112019 3

మీడియా ఉందని చూసుకోకుండా ఆయన చేసిన వ్యాఖ్యలతో, వైసిపీ తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. బొత్సా మాట్లాడుతూ, అక్కడ ఉన్న ఎస్పీని ఉద్దేశించి, హైవేలో రాజమార్గంలో అక్రమంగా ఇసుక వేరే రాష్ట్రాలకు తరలిపోతుంటే, పోలీసులు ఏమి చేస్తున్నారు అంటూ ఎస్పీని ప్రశ్నించారు. పోలీసులు దీని పై స్పందించక పొతే, మేమే చూసుకుంటాం అని వ్యాఖ్యలు చేసారు. లారీకి ఇంతని తీసుకుని, మీరే పోలీసులే, ఇసుక అక్రమ రవాణా అయ్యేలా చేస్తున్నారు. సిసిటీవీలు చూస్తే, మీ బండారం మొత్తం బయట పడుతుంది, అంటూ ఎస్పీ పై ఫైర్ అయ్యారు. అయితే, ఈ వ్యాఖ్యలు మీడియాలో రావటంతో అందరూ అవాక్కయ్యారు. ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఇద్దరు మంత్రులు, డిప్యూటీ సీఎం పాల్గున్న సమావేశంలోనే, ప్రభుత్వమే, ఇసుక అక్రమ రవాణా అయిపోయి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది అని చెప్తుంటే, పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read