అమరావతి తరలింపు పై జగన్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక పోవటంతో, ప్రతి రోజు అమరావతిలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మరో పక్క బొత్సా సత్యన్నారాయణ మాత్రం, ప్రతి రోజు ఎదో ఒక ప్రకటన చేసి, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలు పక్కకి పోయి, అన్ని పార్టీలు రాజధాని మార్పు పైనే మాట్లాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో, ఎక్కువుగా స్పందించకుండా, రోజు వారీ ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు పై పోరాడుతుంటే, బీజేపీ మాత్రం, క్షేత్రస్థాయిలోకి దిగి, అమరావతి ప్రజల తరుపున మాట్లాడుతున్నారు. ఈ రోజు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయాణ, అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ప్రభుత్వం చేస్తున్న గందరగోళ ప్రకటనల పై స్పందించారు. రైతులకు అండగా నిలబడుతాం అని హామీ ఇచ్చారు.
ఇక్కడ ఒక సామాన్య మహిళ మాట్లాడుతూ, మంత్రి బొత్సా ప్రకటనల పై విరుచుకు పడ్డారు. రైతులు త్యాగాలు చేసి భూములు ఇస్తే, బొత్సా మాత్రం, మేము రాజధాని కోసం కాకుండా, మేము కౌలు కోసం ఆందోళన చేస్తున్నామని హేళన చేస్తున్నారని అన్నారు. అలాగే బొత్సా మాట్లాడుతూ, అమరావతి ప్రాంతం, వరదల్లో మునిపోతుంది అని, అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు అంటూ చేసిన వ్యాఖ్యల పై, ఆ మహిళ తీవ్రంగా స్పందించారు. నేను బొత్సా గారికి ఛాలెంజ్ చేస్తున్నా, రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక్క సెంట్ అయినా మునుగుతుందని బొత్సా నిరూపించగలరా అని ఛాలెంజ్ చేసారు. కట్ట కింద ముంపు ఉంటుంది కాని, కట్ట పైన, ఎప్పుడూ మునగలేదని, మొన్న వరదలకు ఒక్క సెంట్ కూడా వరదల్లో లేదని అన్నారు.
బొత్సా సత్యన్నారాయణ, అమరావతికి వరదలు వస్తాయని నిరూపిస్తే, మా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన, మూడున్నర ఎకరాల స్థలాన్ని బొత్స సత్యనారాయణకు రాసిస్తానని సవాల్ చేసారు. ఒక బాధ్యత గల మంత్రి, ఒక పార్టీ ప్రతినిధిగా, వాళ్ళ పార్టీ వైఖరి చెప్తున్నట్టు ఉందని, ఇక్కడ రైతులు కష్టాలు, అమరావతి రాజధాని పై, విశాలంగా ఆలోచన చెయ్యాలని ఆమె అన్నారు. బొత్సా గారు ముందు అవగాహన పెంచుకుని మాట్లాడండి అంటూ ఆ మహిళ అన్నారు. అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు అప్పట్లో అసెంబ్లీలో తీర్మానం చేస్తే, అప్పట్లో జగన్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేసింది అని ప్రశ్నించారు ? అప్పుడే ఇది ముంపు ప్రాంతం అని మీకు తెలియదా అని ప్రశ్నించారు.