దేశంలో ఏ కేసు అయినా సరే, వైఎస్ఆర్ పార్టీ దగ్గరకి చేరుకోవాల్సిందే... అది వాళ్ళ స్టామినా... లేకపోతే ఆ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికే అవమానం... నిన్న తెలంగాణా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హవాలా కేసు చార్జ్‌షీట్‌లో షబ్బీర్ అలీ పేరును నమోదు చేసింది అనే వార్తలు వచ్చాయి... అయితే, షబ్బీర్ అలీతో పాటు, వైఎస్ఆర్ పార్టీ నేత, జగన్ కి కూడి భుజం అయిన, బొత్సా సత్యన్నారాయణ పేరు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హవాలా కేసు చార్జ్‌షీట్‌లో పెట్టింది... షబ్బీర్ అలీ, బొత్సా సత్యన్నారాయణ ఇద్దరూ అప్పటి రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న వారే...

botsa 25102017 2

వివరాల్లోకి వెళ్తే, 2012 సంవత్సరంలో హైదరాబాద్‌కు చెందిన ఎంబీఏ జ్యూయలరీ అధినేత సుఖేష్‌గుప్తా 195 కోట్ల రూపాయల బంగారం తప్పుడు ధ్రువపత్రాలుతో కొనుగోలు చేశారు. ఇది అంతా, మినరల్‌ మైన్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి కొనుగోలు చేశారు. అయితే మినరల్‌ మైన్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌, సుఖేష్‌గుప్తా పై సీబీఐకి ఫిర్యాదు చేసింది. 100 కోట్ల నష్టం చేశారని అని ఫిర్యాదు చేసింది. సీబీఐ దర్యాప్తులో, సుఖేష్‌గుప్తా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి బంగారం కొనుగోలు చేసినట్టు గుర్తించింది. 2013లో సుఖేష్‌గుప్తాని అరెస్ట్‌ చేసింది సీబీఐ.

botsa 25102017 3

జైల్లో ఉన్న ఎంబీఏ జ్యూయలరీ అధినేత సుఖేష్‌గుప్తా బెయిల్‌ కోసం వివిధ మార్గాలను వెతికాడు. తాన్‌పూర్‌కు చెందిన మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీతో సంప్రదింపులు జరిపాడు. ఖురేషీకి బొగ్గు కుంభకోణం నిందితులతోపాటు సీబీఐ అధికారులతో సంబంధాలు ఉన్నాయి. దీంతో సీబీఐ చీఫ్‌ రంజిత్ సిన్హాకు లంచంగా 1.75 కోట్ల రూపాయలు ఇవ్వడానికి డీల్‌ కుదిరింది. విచారణలో ఇదంతా తెలుసుకున్న సీబీఐ... ఖురేషీని అరెస్ట్‌ చేసింది. అతడి బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను ఢీకోడ్‌ చేయగా అందులో షబ్బీర్‌ అలీ, బొత్సా సత్యన్నారాయణ పేరు బయటపడింది. హవాలా వ్యాపారితో షబ్బీర్‌ అలీ, బొత్సా సత్యన్నారాయణకి సంబంధాలు ఉన్నాయని సీబీఐ ఆధారాలు సేకరించింది. సీబీఐ చీఫ్‌కు 1.75 కోట్ల లంచాన్ని మొయిన్‌ ఖురేషీ ద్వారా షబ్బీర్‌ అలీ, బొత్సా సత్యన్నారాయణ హవాలా చేయించినట్టు సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో షబ్బీర్‌ అలీ పేరును కూడా చార్జిషీట్‌లో చేర్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read