ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో, ఇబ్బంది పడుతున్నాం అంటూ కేంద్ర ప్రభుత్వం వాపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యుత్ పీపీఏల విషయంలో, కేంద్రం చాలా ఆగ్రహంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏల పునఃసమీక్ష పై కేంద్ర ప్రభుత్వం తరుపున, కేంద్రం మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసారు. పీపీఏల పునఃసమీక్ష వల్ల, రాష్ట్రం ఒక్కటే కాదని, దేశం పరువు పోయిందని కేంద్రం ఎక్కడో ఒక చోట ఇది ప్రస్తావిస్తూనే ఉంది. తాజాగా ఏపి ప్రభుత్వం తీసుకున్న ఈ విషయాన్ని పై అంతర్జాతీయ వేదిక మీద చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఒక సదస్సుకు కేంద్రమంత్రి గోయల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దక్షిణాదిలో ఓ రాష్ట్రం పీపీఏల పునఃసమీక్షకు ప్రయత్నం చేసిందంటూ, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు. ఇలా ఇబ్బంది పెట్టే వారిని ఏమి చెయ్యలా అని పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని, మీరు కూడా ఈ విషయంలో సలహాలు ఇవ్వండి అని అన్నారు.

piyus 29022020 2

అంతేకాకుండా, ఒక కొత్త చట్టాన్ని తెస్తున్నాం అని, ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా కాంట్రాక్టులు గానీ, వాటికి సంబంధించిన, నిబంధనలు గానీ మారకుండా ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఓ చట్టం రూపొందించాల్సిన అవసరముందని, సలహాలు ఇవ్వాలి అంటూ, పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు మాట వినకపోతే, రాష్ట్రానికి వచ్చే నిధులలో కట్ చేయాలని రిజర్వు బ్యాంకును కోరతామని కేంద్రమంత్రి గోయల్ చెప్పుకొచ్చారు. దీని పై స్పందించిన లోకేష్, ట్విట్టర్ లో వ్యంగంగా పోస్ట్ చేసారు "బలమైన నేత కనుకే ట్రంప్ తో విందుకి పిలవలేదు అని రాష్ట్ర మంత్రి అంటే నమ్మలేకపోయాను. దేశాన్ని నాశనం చేసే అంత బలం, కరోనా కంటే బలమైన వైరస్ అని కేంద్ర మంత్రి మాటలు విన్న తరువాత అసలు విషయం అర్ధం అయ్యింది" అంటూ ట్వీట్ చేసారు.

piyus 29022020 3

అయితే ఈ విషయం పెద్దది అయిపోవటంతో, రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. పీపీఏల వ్యవహారం అంతర్జాతీయ సమస్యో, లేకపోతే, యుద్ధ సమస్యో కాదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పీపీఏల సమీక్షను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తప్పుబట్టిన విషయం, పెద్దదిగా వార్తల్లో రావటంతో, ఆయన స్పందించారు. శుక్రవారం తిరుపతిలో బొత్సా మాట్లాడుతూ, "ఆయన కేంద్రమంత్రి కాబట్టి అలా మాట్లాడారు. మేం రాష్ట్రానికి బాధ్యత వహిస్తాం. పీపీఏల వ్యవహారం అంతర్జాతీయ సమస్యో, దేశాల యుద్ధ సమస్యో కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా తక్కువ ధరకు విద్యుత్‌ దొరుకుతుంటే అధిక ధరకు కొనాల్సిన అవసరమేంటి" అంటూ బొత్సా స్పందించారు. మొత్తంగా, మా తప్పు ఏమి లేదు, కేంద్ర మంత్రి అలాగే మాట్లాడతారు అన్నట్టు బొత్సా స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read