వైసీపీ పార్టీలో లుకలుకలు, గత వారం రోజులుగా బయట పడుతూ వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డికి విధేయులు అంటూ డబ్బా కొట్టే వాళ్ళు కూడా, పదవి పోగానే జగన్ ని ఛీ కొట్టారు. రాజీనామాల వరకు వెళ్లారు. రోడ్ల పై ఆందోళనలు చేసారు. అయితే ఏమైందో ఏమో కానీ, జగన్ మోహన్ రెడ్డి వారిని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి బుజ్జగించటంతో, అందరూ బయటకు వచ్చి, మేము జగన్ వెంటనే నడుస్తాం, అంతా తూచ్ అనేసారు. లోపల ఏమి జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. ఇలా మంత్రి పదవి రాని వాళ్ళు, నానా రచ్చ చేసి, జగన్ మోహన్ రెడ్డి ఎంత బలహీనుడో చెప్పకనే చెప్పారు. 151 మంది ఉన్నా , జగన్ పై సొంత పార్టీలోనే ఎంత వ్యతిరేకత ఉందో ఈ దెబ్బతో అర్ధమైంది. ఇక ఈ విషయం పక్కన పెడితే, ఇప్పుడు మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు కూడా, జగన్ మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారా అనే అనుమానం రాక మానదు. తాజాగా సీనియర్ మంత్రి బొత్సా సత్యన్నారాయణ ఇచ్చిన స్ట్రోక్ తో, జగన్ మోహన్ రెడ్డికి షాక్ కొట్టిందనే చెప్పాలి. మొన్న జరిగిన క్యాబినెట్ మార్పుల్లో బొత్సా సత్యన్నారాయణకు జగన్ మోహన్ రెడ్డి విద్యా శాఖ ఇచ్చారు. గతంలో మునిసిపల్ శాఖా మంత్రిగా పని చేసిన బొత్సాకు, మరింత పెద్ద పదవి వస్తుందని అనుకుంటే, విద్యా శాఖ లాంటి చిన్న శాఖ ఇచ్చి సరిపెట్టారు.
అయితే బొత్సాకు విద్యా శాఖ ఇవ్వటం పట్ల, జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ ఉందనే ప్రచారం జరిగింది. బొత్సాకి మరింత పవర్ రాకుండా, కట్ చేసారనే ప్రచారం ఉంది. ఇది ఇలా ఉంటే, నిన్న విద్యా శాఖ పైన సమీక్ష జరిగింది. జగన మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బొత్సా పాల్గునలేదు. అధికారులు మాత్రమే వచ్చారు. అంతకు ముందు రోజు వైద్య శాఖ పైన రివ్యూ జరిగితే, దానికి విడదల రజినీ వచ్చారు. అయితే ఈ సమావేశానికి బొత్సా రాకపోవటం పై, ఆయన ఏమైనా అసంతృప్తితో ఉన్నారా అనే ప్రచారం జరుగుతుంది. ఆయనకు చిన్న శాఖ ఇచ్చి అవమానించారా అనే ప్రచారం ఉంది. ఇప్పటి వరకు బొత్సా, కొత్త మంత్రిగా బాధ్యత తీసుకోలేదు. ప్రామాణ స్వీకారం తరువాత, మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ప్రమాణ స్వీకారం సమయంలో కూడా, అందరూ జగన్ కాళ్ళ మీద పడితే, బొత్సా నిటారుగా నుంచుని, జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు జగన చేసిన సమీక్షకు కూడా బొత్సా రాకపోవటం పై చర్చ జరుగుతుంది.