ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం చేస్తున్న అన్యాయం పై కాకుండా, ప్రత్యేక హోదాపై ఎంపీల చేత రాజీనామా చేపిస్తా అంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి దొరికిపోయారు. ఈసారి బొత్సా సత్యన్నారాయణ విలేకరులతో మాట్లాడుతూ, ఫ్లో లో విజయసాయి రెడ్డి గుట్టు విప్పారు.. ఇప్పటికే, జగన్ చేసిన రాజీనామా ప్రకటన పై ప్రజలు, అది అంతా డ్రామా అని, ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావని, అందుకే కొత్త నాటకానికి తెరలేపారని అంటున్న టైంలో, బొత్సా వ్యాఖ్యలు మరింత ఇబ్బందికి గురి చేసాయి...

botsa 15022018 2

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ బుధవారం చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మరో ఆయుధాన్ని అందించినట్లు అయింది. తమ పార్టీకి చెందిన లోకసభ సభ్యులు రాజీనామా చేస్తారని, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చేయరని చెప్పారు.లోకసభ ఎంపీలు ఎందుకు రాజీనామా చేస్తారు, విజయ సాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేయరు అనే విషయాన్ని కూడా బొత్స చెప్పారు. లోకసభ ఎంపీలను ప్రజలు ఎన్నుకున్నారని, కానీ విజయసాయి అలా ఎన్నుకోబడలేదని అందుకే ఆయన రాజీనామా చేయరని తలతిక్క వాదనతో దొరికిపోయారు...

botsa 15022018 3

బొత్సా ప్రకటనతోనే వైసీపీకి ఉన్న చిత్తశుద్ధి తెలిసిపోతుందని విమర్శలు వస్తున్నాయి.... టీడీపీ నేతల విమర్శలు కూడా నిజం అవుతున్నాయని అంటున్నారు... జగన్ రాజీనామా ప్రకతన డ్రామానే అనటానికి ఇదే పెద్ద నిదర్సనం టున్నారు ... ఏడాదికి ముందు ఎన్నికలు రావనే వారి వ్యాఖ్యలను ఇలా నిజం చేస్తున్నారని అంటున్నారు... బొత్సా వ్యాఖ్యల పై జగన్ కూడా సీరియస్ అయినట్టు సమాచారం, విజయసాయి రెడ్డి రాజీనామా విషయం వచ్చినప్పుడు, ఎలా తప్పించుకుని సమాధానం చెప్పాలో చెప్పినా, ఇలా ఎందుకు చేసావ్ అంటూ బొత్సా పై జగన్ ఇంతెత్తున ఎగిరినట్టు వైసిపీ వర్గాలు చెప్తున్నాయి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read