జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమ ఆస్తుల కేసుల్లో, మరొక నిందితుడుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారికి, తెలంగాణా హైకోర్టు షాక్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో, ఇప్పటికే సిఐడి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే తన పై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఉన్నాయని, వాటిని సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తుందని, సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేయాలి అంటూ, ఆయన తెలంగాణా హైకోర్టుకు వెళ్ళారు. దీని పై వెంటనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే తెలంగాణా హైకోర్టు మాత్రం, ఆయనకు షాక్ ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్య, జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమ ఆస్తులు కేసులో ఒకటైన లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసులో, ఆయన పై కూడా అభియోగాలు నమోదు అయ్యింది. అయితే బీపీ ఆచార్య పై, అవినీతి నోరోధక చట్టం కింద, పలు సెక్షన్లలో నమోదైన కేసులు విషయంలో, విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం గతంలో అంగీకరించ లేదు కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం, మాజీ ఐఏఎస్ అధికారి పై, విచారణకు, సిబిఐకి అనుమతి ఇచ్చింది. అయితే కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వెంటనే నిలిపి వేయాలి అంటూ, బీపీ ఆచార్య హైకోర్టులో ఒక కేసు వేసారు.

bpacharya 22052021 2

అయితే ఆ గడువు ఇప్పుడు ముగియటంతో, సిబిఐ కోర్టు బీపీ ఆచార్య పై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేసి, విచారణకు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని పై బీపీ ఆచార్య హైకోర్టుకు వెళ్ళారు. తాను ఇప్పటికే కేంద్రం వద్దకు అభ్యర్ధన పెట్టుకున్నా అని, కేంద్రం నుంచి ఏదో ఒక న్రినయం వచ్చే దాకా, ఈ కేసు నిలుపుదల చేయాలని, అలాగే సిబిఐ ఇచ్చిన ఉత్తర్వులను, వెంటనే కొట్టేయాలని, ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై తెలంగాణా హైకోర్టులో విచారణ జరిగింది. దీని పై ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి హైకోర్టు ఒప్పుకోలేదు. దీని పై, త్వరలోనే తుది విచారణ చేపడతామని హైకోర్టు చెప్పింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు మాత్రం ఇవ్వమని చెప్పింది. ఇక మరో పక్క బీపీ ఆచార్య పిటీషన్ పై, కౌంటర్ దాఖలు చేయలని, హైకోర్టు, సిబిఐని ఆశ్రయించింది. ఇక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్‌, ఎండీగా ఉన్న బీపీ ఆచార్య, నిబంధనలకు విరుద్ధంగా, సుమారుగా, 8,841 ఎకరాలను, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు ఇచ్చారనేది అభియోగం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read