ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం తెలుసుకున్న బ్రాహ్మణ సంఘాలు, పెద్ద ఎత్తున సమీకరణ జరిపి, ఆ ఆత్మీయ సమావేశానికి జగన్ ను ఆహ్వానించారు. ఏమైందో ఏమో కాని, ముందు వస్తాను అని చెప్పిన జగన్, తరువాత హ్యాండ్ ఇచ్చారు. అంతకు ముందు జగన్ ను కలవటానికి వచ్చిన బ్రాహ్మణ సోదరులు, కొంత మంది, జగన్ ను ఆశీర్వదిస్తూ, జగన్ పై చేయి పెట్టగానే, సెక్యూరిటీ సిబ్బంది లాగి పడేసారు. ఇలా చేస్తున్నా, జగన్ మాత్రం వారిని వారించలేదు. జగన్ ను ఆశీర్వదిస్తానికి వస్తే, ఇలా అవమానిస్తారా అంటూ, అక్కడ వారు చిన్నబుచ్చుకున్నారు.. ఇంత చేసిన జగన్, ఏమి అనకపోవటం చూస్తుంటే, జగనే ఇలా చెయ్యమన్నాడేమో, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారు తప్పితే, మా లాంటి పేద బ్రాహ్మణలు జగన్ కు కనిపించరేమో అని, వారు అన్నారు.

jagan 13062018 2

అయితే, ఈ రెండు సంఘటనలతో బ్రాహ్మణ సంఘాలు రగిలిపోతున్నాయి. రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సభకు రాకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్ తమను అవమానపరిచారని రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ప్రతినిధులు మండిపడుతున్నారు. జగన్ వస్తారన్న వైసీపీ నేతల భరోసాతోనే ఏర్పాట్లు చేసుకున్నామని, సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు తరలి వచ్చారని బ్రాహ్మణ సంఘాలు చెబుతున్నాయి. ప్రజాసంకల్ప యాత్రంలో భాగంగా జగన్ రాజమండ్రిలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయసభకు హాజరవుతారని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. దాంతో ఈ సభ కోసం 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే జగన్ మాత్రం హాజరు కాకుండా తన జాతిని అవమానపరిచారని బ్రాహ్మణ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

jagan 13062018 3

బ్రాహ్మణులకు జరిగిన అవమానంపై రాష్ట్ర నేతలంతా రాజమండ్రిలోని ఓ హోటల్‌లో అత్యవసర సమావేశం అయ్యారు. జగన్ అవమానించిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించకపోతే రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, వైసీపికి వ్యతిరేకంగా పనిచేస్తామని అన్నారు. జగన్‌తోపాటు వైసీపీ నేతలను బహిష్కరిస్తామని అన్నారు. త్వరలో చేపట్టనున్న బస్సు యాత్రంలో జగన్ చేసిన అవమానాన్ని ప్రజలకు వివరిస్తామని బ్రాహ్మణ సంఘం నేతలు పేక్కొన్నారు. ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారు తప్పితే, మా లాంటి పేద బ్రాహ్మణలు జగన్ కు కనిపించరేమో అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read