ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలకు సంబంధించి బ్రేక్ పడింది అనే చెప్పవచ్చు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు అయిపోతాయి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం అర్ధరాత్రి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం బుధవారం నుంచి అభ్యంతరాలు స్వీకరించే కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. నిన్న మొత్తం వైసిపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఈ లోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి షాక్ తగిలింది. నిజానికి ఇది షాక్ కాదు. ప్రభుత్వానికి కూడా ఇది తెలుసు. అయినా ఏదో గేం ఆడింది. కేంద్రం నుంచి డైరెక్టర్ అఫ్ సెన్సెస్ నుంచి, తాజా ఆదేశాలు వచ్చాయి. జనగణన జరగటంలో జాప్యం జరుగుతుందని, ఇప్పటికే కరోనా వల్ల, సెన్సెస్ జాప్యం జరిగందని, ఇప్పటికే అయిపోవలసి ఉన్నా, అవ్వలేదని అన్నారు. ఈ నేపధ్యంలోనే జిల్లాలకు సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్ సరిహద్దులు ఉన్నాయో, కొత్త సెన్సెస్ అయ్యే వరకు అవి మార్చటానికి వీలు లేదని స్పష్టం చేసారు. సెన్సెస్ డైరెక్టర్ రజిత్ కుమార్ రాసిన లేఖలో, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీలకు, ఈ విషయం స్పష్టం చేసారు. 1980 సెన్సెస్ రూల్స్ ప్రకారం, సెక్షన్ 8 అండ్ 4 ప్రకారం, సెన్సెస్ అయ్యేంత వరకు , జిల్లాల సరిహద్దులు మార్చటానికి వీలు లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
సరిహద్దులు మార్చితే, సెన్సెస్ సరిగ్గా రాదని, ఇబ్బంది అవుతుందని స్పష్టం చేసారు. కరోనా ఫస్ట్, సెకండ్ , థర్డ్ వేవ్ ల కారణంగా, అలాగే వ్యాక్సినేషన్ ఉదృతంగా జరుగుతున్న నేపధ్యంలో, ఇప్పుడు జనగణన చేయటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేసారు. ఈ ఏడాది జూన్ వరకు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా, జిల్లా బౌగోళిక సరిహద్దులు మార్చవద్దు అని, పాలనా పరంగా వీటి పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట్రాలకు స్పష్టం చేసారు. మాములుగా అయితే సెన్సెస్ డైరెక్టర్ , 2021 డిసెంబర్ వరకు కూడా జిల్లాల సరిహద్దులు మార్చటం పై నిషేధం విధించారు. అయితే ఇప్పుడు ఆ ఆదేశాల సమయం అయిపోవటం, ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ రావటం, ఇప్పుడే సెన్సెస్ చేసే అవకాసం లేకపోవటంతో, ఈ ఆదేశాలు జూన్ వరకు పొడిగించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడావడిగా చేసిన కొత్త జిల్లాల ప్రకటన ఇప్పుడు వాయిదా పడినట్టే చెప్పాలి. జూన్ వరకు ఆగాలి అని చెప్పటం అంటే, ఇది మరో ఏడాది వరకు, లేదా ఇంకా ఎక్కువ కాలం అవ్వవు అనే చెప్పాలి.