దేశీయ ఎఫ్‌ఎంసిజి సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్‌.. మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలనుకున్న డెయిరీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే యోచనలో ఉంది. ఈ ప్రతిపాదిత ప్లాంటుకు ఆర్థిక ప్రోత్సాహకాలిచ్చే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సమయం తీసుకుంటోందని సోమవారం జరిగిన వాటాదారుల వార్షిక సమావేశం(ఎజిఎం)లో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ నుస్లీ వాడియా తెలిపారు. దాంతో ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చించడం జరిగిందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రూ.300 కోట్లతో భారీ డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది సంస్థ.

britania 07082018 1

రూ.2 ముఖ విలువ కలిగిన కంపెనీ షేర్లను రూపాయి ముఖ విలువతో రెండు షేర్లుగా విభజించాలని ప్రతిపాదించినట్లు వాడియా వెల్లడించారు. షేర్ల విభజనపై ఈనెల 23న బోర్డు సభ్యులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు, ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.60 విలువ చేసే నాన్‌ కన్వర్టిబుల్‌ బోనస్‌ డిబెంచర్‌ను జారీ చేయనున్నట్లు, వాటిపై 8 శాతం వడ్డీ ఆఫర్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ డిబెంచర్లను సంస్థ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయనుంది. ఈ తరహా డిబెంచర్లను జారీ చేయడం సంస్థకు ఇది రెండోసారి. మొత్తం 12,01,59,147 బోనస్‌ డిబెంచర్ల జారీ కోసం రూ.720 కోట్ల మేర వ్యయంకానుందని వాడియా తెలిపారు.

britania 07082018 1

వచ్చే ఏడాదికాలంలో కంపెనీ రూ.400-500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడంతోపాటు డెయిరీ, కేక్స్‌, రస్క్‌ బిస్కెట్‌ వ్యాపారాలపై దృష్టిసారించనుందన్నా రు. ఈ ఏడాదిలో 50కి పైగా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇతర సంస్థల కొనుగోళ్లకు, ఇతర దేశాల్లోకి విస్తరించేందుకు సైతం సంస్థ సిద్ధంగా ఉందన్నారు. సంస్థ ఎగమతులకు ఊతమిచ్చేందుకు ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీకి బిస్కెట్ల విక్రయాల్లో 33 శాతం మార్కెట్‌ వాటా ఉంది. వందో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కంపెనీ కొత్త లోగోను ఆవిష్కరించింది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read