తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్ కేసులో గందరగోళం నెలకొంది. బీటెక్ రవిని, పులివెందులలో జరిగిన నాగమ్మ ఘటన నిరసన పై, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని వార్తలు వచ్చాయి. అన్ని ప్రముఖ వార్తా చానల్స్ ఇదే విషయం ప్రస్తావన చేసాయి. చివరకు బీటెక్ రవి కూడా, తనను పోలీసులు అరెస్ట్ చేసారని, పులివెందుల పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారని మీడియాకు తెలిపారు. ఒక వీడియో మెసేజ్ ద్వారా బీటెక్ రవి తన అరెస్ట్ విషయం చెప్పారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా, ఇదే విషయం పై ట్వీట్ చేసారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ కాపి కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే పోలీసులు చేసిన ప్రకటనతో మొత్తం వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది. 2018లో పులివెందులలో వైసిపీ, తెలుగుదేశం మధ్య జరిగిన ఒక ఘటనలో, బీటెక్ రవి ఉన్నారని, ఆ కేసులో ఈ రోజు బీటెక్ రవిని అరెస్ట్ చేసామని, మొన్న పులివెందులలో జరిగిన నాగమ్మ ఘటనలో బీటెక్ రవిని అరెస్ట్ చేయలేదని కడప ఎస్పీ అన్బురాజన్ మీడియాకు తెలిపారు. అయితే ఉదయం నుంచి పులివెందుల ఎస్సీ ఎస్టీ కేసు అని లీకులు ఇచ్చి, 2018 కేసులో అరెస్ట్ చూపించారు. 2018 నుంచి బీటెక్ రవిని ఎందుకు అరెస్ట్ చేయలేదో తెలియాల్సిన విషయం. మొత్తానికి తెలుగుదేశం నేతల పై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read