Sidebar

19
Wed, Mar

టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. మంగళవారం కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో జరిగిన ఈ పరిణామంతో గంటకు పైగా ఉద్రిక్త పరిస్థితి నెలకొం ది. టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాల లోక్‌సభ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి ఆత్మకూరు పట్టణం లో రోడ్‌షో నిర్వహించారు. టీడీపీ రూట్‌మ్యాప్‌ ప్రకారం సా యంత్రం లింగాయితివీధి నుంచి అమ్మవారిశాల ఎదురుగా ఎ మ్మెల్యే కాన్వాయి చేరింది. మరోవైపు నంద్యాల టర్నింగ్‌ నుంచి ఎస్పీజీపాలెంలోకి ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్తున్న వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి కాన్వాయి నిర్ణయించిన సమయం కాటే చాలా ఆలస్యంగా అటువైపు వచ్చింది. ఎమ్మె ల్యే బుడ్డా కాన్వాయి ముందు ఉండటంతో దాన్ని దాటి వెళ్లాలని వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.

budda 03042019

బెదిరింపు ధోరణి ప్రదర్శించారు. ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ రమే్‌షబాబు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినా వైసీపీ కార్యకర్తల తీరు మారలేదు. గొల్లపేట సెంటర్‌లో ఎమ్మెల్యే బుడ్డా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు డ్రమ్స్‌ మోగించడం, టపాసులు కాల్చడం, మైకుల్లో కేకలు వేయడం, కళాజాత బృందాల తో పాటలు పాడించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. వారిని అదుపుచేసేందుకు పోలీసులు యత్నించడంతో తోపులాట జరిగింది. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ కాన్వాయిలోకి రాకుండా పోలీసులు రోప్‌(తాడు) బృందాన్ని వినియోగించారు. వందలాదిమంది అక్కడికి చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి సంయమనంతో తన కాన్వాయ్‌ని ముందుకు పంపించడంతో వివాదం సద్దుమణిగింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read