ఏపీలో నయవంచక పాలన కొనసాగుతోంది. గతంలో ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఇంతటి ప్రజావ్యతిరేక కార్యకలాపాలు అవలంభించిన ఏకైక ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డే. కోర్టులు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. సంక్షోభ సమయంలోనూ మీ మంత్రులకు ప్రభుత్వం నుంచి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎస్కార్ట్ లతో మంత్రులు తిరుగుతున్నారు. మంత్రులకు వచ్చే ఒక్క రాయితీలు కూడా రద్దు చేయలేదు. ప్రజలకు మాత్రం అన్నీ రద్దు చేస్తున్నారు. ఆర్టీసీలో హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు. వృద్ధులు, జర్నలిస్టుల రాయితీలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి మంత్రులకు సదుపాయాలు ఎందుకు కొనసాగిస్తున్నారో సమాధానం చెప్పాలి. అన్నా క్యాంటీన్లు, సంక్రాంతి, రంజాన్ తోఫా, రుణమాఫీ, చంద్రన్న బీమా రద్దు చేశారు. బీసీ కార్పొరేషన్ల నిధులు దారి మళ్లించారు.

అమరావతి పనులు నిలిపేశారు. తిరుపతిలో భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డు కూడా రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. ఇది రద్దుల ప్రభుత్వం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం కాదు. వైసీపీ ప్రభుత్వంలో అమెరికాకు చెందిన 9 మందికి కేబినెట్ ర్యాంకు పదవులు ఇచ్చారు. వారు నెలనెలా3 లక్షల 60 వేలు డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. వైసీపీ వారికి పదవులు కట్టబెట్టటమే కాకుండా వాటి ద్వారా లభ్ది చేకూర్చేందుకు ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారు. చంద్రబాబులా పెట్టుబడులు తీసుకురాలేము, తమను చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరనే భావంతోనే వైసీపీ ....ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్ , గుంటూరు సబ్ జైలు అమ్మకానికి పెట్టారు. ఈడీ జప్తు చేసిన రూ. 43 వేలు కోట్లను ప్రజా ఉపయోగ కార్యక్రమాలను వినియోగించండి.

అప్పుడు ప్రభుత్వ ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఉండదు. మీరు దోచుకున్న ఆస్తులు భద్రంగా ఉండాలి.ప్రభుత్వ ఆస్తుల మాత్రం అమ్మకానికి పెడతారా? వైసీపీ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. కరోనా సమయంలో ఏపాటి సాయం చేశారో ప్రజలకు అర్ధమైంది. పేదలకు అందకుండా రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి. ప్రభుత్వంలో ఉన్న వారు ఖర్చులు తగ్గించుకోవాలి. పేదలకు అందే సాయంలో కోత విధించడం సరికాదు. టీడీపీపై కక్షసాధింపు చర్యలు మాని శాంతిభద్రతలను కాపాడండి. వైసీపీ నేతలకు పెట్టుబడులు తేవడం ఎలాగూ చేతకాదు. చంద్రబాబు సమర్థతను చూసే కియా సహా అంతర్జాతీయ కంపెనీలు ఏపీకి వచ్చాయి. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై వైసీపీ చర్చకు రావాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read