సొంతబాబాయి హ-త్య-కేసుని సీబీఐకి అప్పగించడానికి, జగన్‌ ఎందుకు తాత్సారం చేస్తున్నాడని, వై.ఎస్‌.వి-వే-కా కుమార్తె, భార్య హైకోర్టుకు వెళ్లినా దానిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదని టీడీపీనేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. బుధవా రం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వి-వే-కా కేసులో జగన్‌పాత్ర ఉందన్న అనుమానం నానాటికీ బలపడుతోందని, కేసు విచారణలో జగన్‌వైఖరి చూస్తుంటే ప్రజల అనుమానాలకు బలం చేకూరుతోందని వెంకన్న స్పష్టంచేశారు. వి-వే-కా కుటుంబసభ్యులు సీబీఐ విచారణకోరుతుంటే, జగన్‌ సిట్‌ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. వి-వే-కా తన ఇంట్లోనే హ-త్య-గావించబడిన తీరుచూసి రాష్ట్రమంతా చలించినా, కొడుకు తర్వాతి కొడుకైన జగన్‌ ఎందుకు మిన్నకుండిపోయాడో తెలియడంలేదన్నారు. జగన్‌ సీఎం అయ్యాక వి-వే-కాహత్యకేసు నత్తనడకన సాగుతోందని ఆయన కుటుంబసభ్యులే చెబుతున్నారని వెంకన్న తెలిపారు. తనతండ్రి కేసుని సీబీఐకి అప్పగించాలని, వీలైనంతత్వరగా దోషుల్ని పట్టుకోవాలని సునీత కోరినా, జగన్‌ స్పందించనందునే ఆమె కోర్టు తలుపు తట్టిందన్నారు.

మడమతిప్పని వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్న జగన్‌, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాశ్‌రెడ్డి సహా, ఇతరకుట్రదారులకు ఎందుకు కొమ్ముకాస్తున్నాడని వెంకన్న నిలదీశారు. ముఖ్యమంత్రివైఖరి, కేసువిచారణ జరుగుతున్న తీరుచూస్తుంటే, భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిలతోపాటు జగన్‌ ప్రమేయంకూడా ఉందన్ని స్పష్టమవుతోందన్నారు. ఎవరికీ భయపడని, ఎవర్నీ లెక్కచేయని జగన్‌, తన కుటుంబ సభ్యులను అరెస్ట్‌ చేయించడానికి ఎందుకు వెనకాడుతున్నాడు. విచారణను సీబీఐకి అప్పగిస్తే, తనవారితోపాటు తనపేరుకూడా బయటపడుతుందన్న అనుమానం జగన్‌లో ఉందని బుద్ధా పేర్కొన్నారు. 2014ఎన్నికల్లో ఎమ్మెల్యేటిక్కెట్‌ తనకు ఇవ్వాలని భాస్కర్‌రెడ్డి కోరాడని, అప్పటినుంచే వి-వే-కాతో వారికి మనస్పర్ధలు ప్రారంభమయ్యాయని బుద్ధా తెలిపారు. వి-వే-కా-హ-త్య జరిగిన తీరుచూస్తుంటే, ఆయనను చం-పి-న వారు ఆయనపట్ల ఎంతకసితో ఉన్నారో అర్థమవుతోందన్నారు.

ఒంటినిండా గొ-డ్డ-లి-గా-ట్ల-తో ఉన్నవ్యక్తి, గుండెపోటుతో మృ-తి-చెందాడని చెప్పించారని, వి-వే-కా-మృ-త-దే-హా-న్ని చూడటానికి వచ్చిన ప్పుడు జగన్‌ కంటినుంచి ఒక్కచుక్కకూడా కన్నీరురాలేదన్నారు. దివంగత వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు, తన తమ్ముడు వి-వే-కా చాలా మంచివాడని చెప్పారన్నారు. అధికారముంది కదా అని రైతుల్ని, మహిళల్ని, ప్రతిపక్షసభ్యుల్ని వేధిస్తున్న జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే, తనచెల్లి, తనచిన్నమ్మ చేసిన అభ్యర్థనపై వెంటనే స్పందించి వి-వే-కా హ-త్య-కే-సు-ని సీబీఐకి అప్పగించాలన్నారు. జగన్‌ తీరుమారకుంటే, వి-వే-కా-హ-త్య-కే-సు-ని జనంలోకి తీసుకెళతామని, తమపార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే అసలుదోషుల్ని చట్టంముందు నిలబెడతామని వెంకన్న తేల్చిచెప్పారు. మండలిరద్దుచేయడంద్వారా జగన్‌ ప్రజలముందు మండలిసభ్యులను హీరోలను, త్యాగపురుషుల్ని చేశాడని విలేకరు లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బుద్ధా అభిప్రాయపడ్డారు. జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మండలిలో ఉన్నతన ఇద్దరుమంత్రులతో రాజీనామా చేయించి, మండలి ని రద్దుచేసి ఉండాల్సిందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read