జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో హిట్లర్ పాలన జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కాస్త ముందు పుట్టి ఉంటే హిట్లర్ పేరు ప్రపంచానికి తెలిసేది కాదు. ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అరాచకప్రదేశ్ గా మార్చేశారు. అచ్చెన్నాయుడి గారి అక్రమ అరెస్టుతో ఈ విషయం మరోసారి రుజువైంది. తెలుగుదేశం నాయకుల అక్రమ అరెస్టులతో చంద్రబాబునాయుడు గారిని భయపెడుతున్నానని జగన్మోహన్ రెడ్డి భ్రమపడుతున్నారు. అది కేవలం చంద్రుడికి పట్టిన గ్రహణంతో సమానం. మరలా వచ్చే చంద్రకాంతులను ఎవరూ ఆపలేరు. ఎందరు నాయకులు పార్టీని వీడినా.. 2024లో తిరిగి తెలుగుదేశాన్ని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకురాగల సత్తా చంద్రబాబునాయుడు గారికి ఉంది. యుద్ధం నుంచి పారిపోయే వారు పిరికివాళ్లు. అక్రమ అరెస్టులకు భయపడి పార్టీ మారేవారు కూడా అటువంటి పిరికివారితోనే సమానం. కురుక్షేత్రంలో దుర్యోధనుడికి 100 మంది సోదరులు ఉన్నట్లు.. జగన్ రెడ్డికి 151 మంది ఉన్నారు. అయినా ధర్మం ఎప్పుడూ ధర్మరాజు అయిన చంద్రబాబునాయుడు గారితోనే ఉంది. జేసీ బ్రదర్స్ రాజశేఖర్ రెడ్డితో ఉన్నప్పుడు అంత కరెక్ట్ అని.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తప్పు అనడం సరైన విధానం కాదు. చివరకు కుటుంబ వివాదాన్ని పెద్దరికంతో పరిష్కరించినందుకు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపైనా అక్రమ కేసులు బనాయించారు.

జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు జీవితం గడిపారు కనుక తెలుగుదేశం నాయకులందరూ జైలుకు వెళ్లాలనుకోవడం సరైన విధానం కాదు. వైకాపా పుట్టుక అవినీతి ఆర్జనతో ప్రారంభమైంది. అటువంటి మీరు అవినీతి గూర్చి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దళిత, బలహీన వర్గాల వారినే టార్గెట్ చేస్తున్నారు. మహానాడులో ఎప్పుడైతే చంద్రబాబునాయుడు గారు బీసీలకు అధిక ప్రాధాన్యమిచ్చారో.. నాటి నుంచి వారిని టీడీపీకి దూరం చేయాలనే ఆలోచనతో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తప్పు చేస్తే ఎవరిరైనా శిక్షించాలి. కానీ తప్పు చేయని అచ్చెన్నాయుడు వంటి నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం. పైగా పార్టీ నిండా దొంగలు, దోపిడీదారులు, ఎర్రచందనం స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్లను పెట్టుకుని.. అవినీతి గూర్చి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరులందరికీ 70 ఎంఎం సినిమా చూపడం ఖాయం.

చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తామని నోటికొచ్చినట్లు పేలుతున్న ఎమ్మెల్యే రోజా గారు సినిమా ఇంకా అవ్వలేదని గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అసలు సినిమా మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి ఫ్యాక్షనిజం చేస్తోంది. ఇటువంటి కక్ష సాధింపులు బీహార్ లో కూడా జరగవు. ఏడాది పాలనలో ఏ ఒక్క దానికి శంకుస్థాపన చేయలేదు. తెలుగుదేశం హయాంలో శంకుస్థాపన చేసిన వాటిని పూర్తి చేయలేకపోయారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై 25 ఎంక్వైరీలు వేసి.. ఏ ఒక్క దానిలో అవినీతి ఆరోపణలు నిరూపించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెయిల్ పై బయటకొచ్చి ఏడేళ్లు అవుతోంది. ఆ కేసులను ఎందుకు తేల్చడం లేదు..? కోర్టులు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. లేకుంటే రాష్ట్రం సర్వనాశనం అవతుంది. ఏ ఒక్కరికీ ఉద్యోగావకాశాలు రావు, ఉన్న పెట్టుబడులు తరలిపోతాయి. కావున కేంద్రం జోక్యం చేసుకుని ఇటువంటి ముఖ్యమంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read