తనకున్న పేరు, ప్రఖ్యాతల ద్వారా చంద్రబాబునాయుడు గారు ఎంతో కష్టపడి, గడ్డాలు పట్టుకుని రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఆయా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు గారిని చూసే రాష్ట్రానికి కియా పరిశ్రమ వచ్చింది. ప్రతి ఐటీ కంపెనీ కూడా చంద్రబాబు గారిని చూసే వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జే ట్యాక్స్ పేరుతో ఐటీ కంపెనీలను బెదిరిస్తున్నారు. జగన్ తన స్వార్థం కోసం ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు గారు నిర్మించిన వంద అంతస్తుల భవనాన్ని నేడు జగన్ తేలికగా కూల్చేస్తున్నారు. ప్రజారాజధాని అమరావతిలో లక్ష కోట్ల విలువైన పెట్టుబడులు తరలివెళ్లాయి. అంతర్జాతీయ బ్యాంకుల రుణాలు వెనక్కి వెళ్లాయి. సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల 50వేల కోట్ల పెట్టుబడులు నష్టపోయాం.

anil 23022020 2

రాష్ట్రంలో లక్షా 80వేల కోట్ల విలువైన పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. దీనిద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. కియా పరిశ్రమ ద్వారా 12వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. నేడు జగన్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్లే పరిస్థితి నెలకొంది. అదానీ 70వేల కోట్లు, లులు 2200 కోట్లు, రిలయన్స్ 15వేల కోట్లు, ఒంగోలులో ఏపీపీ పేపర్ మిల్లు 20వేల కోట్లు, బీఆర్ శెట్టి 12వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా పోయాయి. జగన్ కు దోచుకోవడం దాచుకోవడం తప్ప.. పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలు చేతకావు. జగన్ కు పరిపాలన చేతగాదని తేలిపోయింది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఏపీ గురించే మాట్లాడుకుంటున్నారు. విజయవాడ రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు.

anil 23022020 3

గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు కూడా పడిపోయాయి. పెట్టుబడిదారులకు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేదు. చంద్రబాబు గారి మీద కక్షతో ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. జగన్ కు పరిపాలన చేతగాకపోతే కుర్చీలో కూర్చోనే అర్హత లేదు. ఏ వర్గం కూడా నేడు సంతృప్తిగా లేదు. అరకొర సంక్షేమ పథకాలతో పేదలు అనేక అవస్థలు పడుతున్నారు. టీడీపీ హయాంలో పథకాలన్నింటిని రద్దు చేశారు. అన్యా క్యాంటీన్లు రద్దు చేసి పేదవారి పొట్టకొట్టారు. జగన్ కు పరిపాలన చేతగాకపోతే వైసీపీలోనే వేరేవారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రిగా పనిచేయాలి కానీ.. జగన్ కు బౌన్సర్ గా పనిచేస్తున్నారు. అందరినీ జైలుకు పంపి శ్మశానాన్ని ఏలుకొంటారా?

Advertisements

Advertisements

Latest Articles

Most Read