ఆంధ్రప్రదేశ్ శాసనసభా బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరుకు జరిగే అవకాశాలు లేవంటున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాస్తవానికి ఈ నెల27నుంచి ప్రారంభం కావాల్సివుంది. ఈ సమావేశాలను పరిమిత దినాలకు కుదించి నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటన వెలువరించే సందర్భంలో వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే కేంద్రప్రభుత్వం 21రోజుల లాక్ డౌన్ ను పాటించాలని ప్రకటించింది. అంతేకాకుండా పార్లమెంటు సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసారు. ఈ దశలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది.
ఆ దిశలో ప్రభుత్వం న్యాయనిపుణలుతోను, చట్టసభా వ్యవహా రాల పై అవగాహన వున్న మేథావులతో చర్చలు జరువుతుందంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశం పై వలు పర్యా యాలు సమీక్షా సమావేశాలు నిర్వహించిందంటున్నారు. జగన్ బడ్జెట్ సమావేశాల స్థానంలో ఆర్డినెన్స్ ను తీసుకుని వచ్చే విషయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, ముఖ్య మంత్రి ప్రధాన సలహాదారులు అజేయ్ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డిలతో సమీక్షించినట్లు సమాచారం. గతంలో ఉమ్మడి ఏపిలో ఉండగా, రాష్ట్ర వార్షిక ప్రణాళిక పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసిన విషయం ప్రస్తావనకు వచ్చినట్లు కథనాలు ప్రచారంలో ఉంది.
కరోనా వ్యాపిస్తున్న తరుణంలో కేం ద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలనే వాయిదా వేసింది. ఈ వరిస్థితుల నడుమ అసెంబ్లీని నిర్వహించడం సరికాదని జగన్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండునెలల వ్యయాల కోసం ఆర్డినెన్స్ ను జారీ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైందంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గురువారంగాని, ఆ తరువాత రోజుగాని, క్యాబినెట్ సమావేశం పెట్టి, కీలకమైన ఆర్డినెన్స్ ను జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలను 27నకాకుండా నిరవధికంగా రెండు నెలలపాటు వాయిదా వేసే అవకాసం ఉందంటున్నారు. అప్పటికి పూర్తిస్థాయిలో పరిస్థితులు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.