వైసీపీ మూడు రాజ‌ధానులు నినాదం నాట‌క‌మ‌ని తేలిపోయింది. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అంటూ ఇప్ప‌టివ‌ర‌కూ చెప్పుకుంటూ వ‌చ్చినవ‌న్నీ డ్రామాలేన‌ని వైసీపీ పెద్ద‌ల ప్ర‌క‌ట‌న‌లే చెబుతున్నాయి. కోర్టులో కేసులున్నాయ‌ని, రాజ‌ధాని అంశంపై మాట్లాడితే కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కి వ‌స్తుంద‌నే భ‌యం లేకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవ‌లే ఢిల్లీలో ఓ స‌ద‌స్సులో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖే మా రాజ‌ధాని, నేను అక్క‌డికే షిఫ్ట్ అవుతున్నానంటూ ప్ర‌క‌టించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోర్టుల దృష్టికి తీసుకెళ్లారు పిటిష‌న‌ర్లు. మ‌ళ్లీ ఆర్థిక‌శాఖా మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి కూడా విశాఖే మా రాజ‌ధాని అని చెప్ప‌క‌నే చెప్పారు. బెంగళూరు పారిశ్రామిక సదస్సులో మంత్రి బుగ్గన విశాఖ కేపిట‌ల్ గురించి ఇన్ డైరెక్టుగా మాట్లాడారు. మూడు రాజధానులు అనేది తప్పుగా కమ్యూనికేట్ అయింద‌ని వివ‌రించారు.  విశాఖ నుంచే మొత్తం పరిపాలన సాగుతుంద‌ని చెప్పుకొచ్చారు. పాలనా రాజధానిగా విశాఖనే సరిగ్గా సరిపోతుంద‌న్నారు.  మౌలిక వసతులు, మరింత అభివృద్ధి చెందే ప్రాంతం విశాఖ అని చెప్పుకొచ్చారు. పోర్టుసిటీ, కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరం విశాఖ అని మంత్రి వివ‌రించారు.  హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే కర్నూలులో ఉంచాలనుకుంటున్నామ‌ని చెప్ప‌డం ద్వారా మూడు రాజ‌ధానులు ఉండ‌నే ఉండ‌వ‌ని, క‌ర్నూలు న్యాయ‌రాజ‌ధాని అనేది కూడా ఉత్తుదేన‌ని బుగ్గ‌న తేల్చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ మూడు ప్రాంతాల్లో మూడు రాజ‌ధానుల పేరిట వైసీపీ గ‌ర్జించిందంతా నాట‌క‌మేన‌ని సీఎం, ఆర్థిక మంత్రి చెప్ప‌క‌నే చెప్పేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read