ఒక పక్క రాష్ట్రంలో పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి అంటూ, అందరూ గగ్గోలు పెడుతూ బాధ పడుతున్నారు. మరో పక్క వాతావరణం కూడా అలాగే ఉంది. ఒక్క కొత్త కంపెనీ వచ్చిన పరిస్థితి లేదు. అయితే ఉన్న కంపెనీలు వెళ్ళిపోవటం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా కియా గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా, రాష్ట్రంలో అలజడి రేగింది. కియా లాంటి పెద్ద కంపెనీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే బ్రాండ్ ఇమేజ్ పోతుంది అంటూ, అందరూ బాధపడ్డారు. దీంతో, తమ ప్రభుత్వం పై వచ్చిన కధనంతో, డ్యామేజ్ జరుగుతుందని, వెంటనే ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, ప్రెస్ మీట్ పెట్టి, కియా వెళ్ళిపోతుంది అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. అయితే, రాసింది అంతర్జాతీయ మీడియా అయితే, వాళ్ళని ఏమి అనుకుండా, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు పై పడ్డారు బుగ్గన. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితికి కారణం మొత్తం చంద్రబాబే అంటూ, బుగ్గన చాలా పెద్ద లిస్టు చదివారు.

పారిశ్రామిక రాయతీలకు బకాయలు కూడా చంద్రబాబు ఇవ్వలేదని, తాము వచ్చిన తరువాత, రూ.3,500 కోట్లు ఇచ్చాం అని అన్నారు. అలాగే, చంద్రబాబు అనేక బకాయలు పెట్టారని అన్నారు. రంజాన్, సంక్రాంతి తోఫాలు కూడా, మేమే డబ్బులు కట్టాం అని బుగ్గన అన్నారు. వీటి అన్నిటితో పాటు చంద్రబాబు అప్పులు చేసారని అన్నారు. మొత్తానికి చంద్రబాబు హయంలో చేసిన పనులకు కూడా మేమే డబ్బులు ఇచ్చాం అని బుగ్గన చెప్పారు. ఇక తమ ప్రభుత్వం పై, వస్తున్న ప్రాధాన ఆరోపణకు సమాధానం చెప్పారు. జగన ప్రభుత్వం వచ్చిన తరువాత, ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటం లేదని, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బుగ్గన మండి పడ్డారు.

రాష్ట్రంలో కొత్తగా 1250 కంపెనీలు వచ్చాయని, వారికి భూములు కేటాయించామని చెప్పారు. కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ కు రెడీగా ఉన్నయని బుగ్గన అన్నారు. తాము చంద్రబాబు లాగా ప్రచారం చేసుకోమని, సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్తాం అని అన్నారు. అయితే ఇక్కడే బుగ్గన స్టేట్మెంట్ పై, పలు అనుమానాలు వస్తున్నాయి. 1250 కంపెనీలు పెట్టుబడి పెట్టటం అంటే మాములు విషయం కాదు. ఒక్క కంపెనీ కూడా రాలేదు, అదనీ, రిలయన్స్, లూలు, లాంటి కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అని విమర్శలు వస్తున్న వేళ, 1250 కొత్త కంపెనీలు వచ్చాయి అంటే, ఎవరికీ నమ్మ బుద్ధి కావటం లేదు. ఇదే విషయం పై, క్లారిటీ ఆడుతున్నారు. 1250 కంపెనీలు వద్దు కాని, కనీసం ఒక 20 కంపెనీలు కొత్తగా వచ్చిన వాటి పేర్లు, వివరాలు చెప్పమని కోరుతున్నారు. మరి బుగ్గన గారు, ఏదో చెప్పాలని అలా చెప్పారా, లేక నిజంగానే అన్ని కంపెనీలు వచ్చాయా అనేది, ఆయనే చెప్పాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read