దేశంలో పోలవరం సహా ఐదు అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య దోరణిపై కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌' (కాగ్‌) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2017 మార్చి నాటికి ఈ ఐదు ప్రాజెక్టులపై కేంద్రం రూ.13,299 కోట్లు ఖర్చు చేసిందని, ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాగటం లేదని, పనులు ఇలాగే సాగితే... ఎన్నటికి పూర్తవుతాయని మోడీ సర్కార్‌ తీరును 'కాగ్‌' నిలదీసింది. రాష్ట్రంలోని పోలవరం, గోసిఖాండ్‌ (మహారాష్ట్ర), షాహిపూర్‌ కాండీ డ్యామ్‌ (పంజాబ్‌), సరయు నాహర్‌ పరియోజన (ఉత్తరప్రదేశ్‌), తీస్తా బ్యారేజ్‌ (పశ్చిమ బెంగాల్‌) ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపింది.

caag 27072018 2

వీటి అంచనా వ్యయం మాత్రం 2,341 శాతం పెరిగిపోగా వీటి వల్ల అంత ప్రయోజనం దక్కుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని కాగ్‌ పేర్కొంది. ఈ ప్రాజెక్టుల నివేదిక తయారీ, అనుమతులు, సర్వే, భూ సేకరణ నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ అనేక లోపాలున్నాయని తెలిపింది. నిర్వహణా లోపాలు, కాంట్రాక్ట్‌ పనుల్లో తీవ్రమైన జాప్యం వంటి అనేక కారణాలు ఈ ఐదు ప్రాజెక్టులు పూర్తికాకుండా అడ్డుకుంటున్నాయని కాగ్‌ తెలిపింది. గంగానది శుద్ధీకరణ సాగుతున్న తీరును కూడా తప్పుబడుతూ కాగ్‌ నివేదిక వెలువరించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రాధాన్యత, జాతి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోవటం దేశంపై ప్రతికూల ప్రభావం చూపిందని, రూ.13 వేల కోట్లు ఖర్చు చేశారు, విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు, తాగునీరు రిజర్వాయర్లు నిర్మించలేదు, కనీసం ఆ లక్ష్యాలకు సమీపంగా ప్రాజెక్టులు వెళ్లలేకపోయాయని కాగ్‌ అభిప్రాయపడింది.

caag 27072018 3

దేశంలో 16 సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వగా దశాబ్దకాలం తర్వాత కేవలం ఐదు మాత్రమే అవి కూడా నిర్మాణం దశలోనే ఉన్నాయని కాగ్‌ తీవ్రంగా ఆక్షేపించింది. 2008 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర క్యాబినేట్‌ పలు సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. పోలవరంలో చంద్రబాబు అవినీతి చేసేందుకే, పోలవరం కొత్త అంచనా అయిన 55 వేల కోట్లు చూపిస్తున్నారు అనే వారికి కూడా కాగ్ తన రిపోర్ట్ తో సమాధానం చెప్పినట్టు అయ్యింది. కొత్త భూసేకరణ చట్టం వలెనే కొత్త అంచనాలు 55 వేల కోట్లుకు పెరిగాయని రిపోర్ట్ ఇచ్చింది. మరో విషయం ఏమిటి అంటే కాగ్ రిపోర్ట్ లో జాతీయ హోదా పొందిన పోలవరం ప్రాజెక్ట్ ఖర్చును 55 వేల కోట్లుగా చూపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read