శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ సోదాలపై కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్. రాజకీయ వేధింపుల్లో భాగంగానే కేంద్రం ఐటీ అధికారులను రంగంలోకి దించిందని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. ఒకేసారి 19 బృందాలను దించడం ఎప్పుడూ జరగలేదని మండిపడింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంతో ప్ర త్యక్ష యుద్ధానికి దిగాలని నిర్ణయించింది. ఉద్దేశపూర్వకంగా, రాజకీయ వేధింపుల దృష్టితో చేస్తున్న ఇటువం టి దాడులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల సహకారం ఇవ్వరాదని నిర్ణయించారు.

ap cabinet 06102018

ఐటీ సోదాలకు వచ్చే అధికారులకు భద్రత కల్పించకూడదని నిర్ణయించింది. లా సెక్రటరీ సలహా తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకే సామాజికవర్గంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని.. కేంద్రంపై అన్ని స్థాయిల్లో పోరాటం చేయాలని.. ఈ మేరకు కేబినెట్‌లో చర్చించినట్టు సమాచారం. కేంద్రం వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్న తీరు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలని తీర్మానించారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఏసీబీ వంటి సంస్థలు విచారణ జరపకుండా గతంలో ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకోవడంపైనా దృష్టి సారించారు.

ap cabinet 06102018

మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడానికి రాజకీయంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ‘‘నేను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇందిరాగాంధీ నుంచి అనేక మంది ప్రధాన మంత్రులను చూశాను. రాజకీయంగా అనేక మందితో విభేదించాం. కానీ, ఈ ప్రధానిలాగా పగ, కక్షతో వ్యవహరించే ధోరణి ఎక్కడా లేదు. ప్రతి రోజూ ఏదో ఒక అలజడి. తెల్లవారితే ఈ రోజు ఏం చేస్తారో... ఎక్కడ సమస్య తెస్తారో అని కాచుకొని చూసుకొనే పరిస్థితి తేవడం ఘోరం. దీనిని చూస్తూ ఊరుకోవడం సరికాదు. ఎంతవరకైనా పోరాడదాం’’ అని సీఎం అన్నారు. రాజకీయ వేధింపులే కాకుండా ఏపీకి పెట్టుబడిదారులు రాకుండా చేయాలన్న కసి కేంద్రంలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read