ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉహాగానాలకు తెరదిగిందనే చెప్పాలి. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు సంసిద్ధమైంది. ఈ నెల 22న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. అదే రోజున మధ్యాహ్నం ఒంటిగంట తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఆ రోజున ఇద్దరు కొత్త మంత్రులు ప్ర మాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ ఎంఎల్‌సీ పదవులకు రాజీనామాతో చేసారు. దీంతో పాటుగా మంత్రి వదవులకు రాజీనామా చేసి, నంబంధిత పత్రాలను జగన్‌కు అప్పగించారు. జగన్ మోహన్ రెడ్డి ఇంకా వాటిని ఆమోదించలేదు. అయితే రాజ్యసభ సభ్యులైనందున వారు ఆరు నెలలకు మించి పదవిలో కొనసాగే అవకాశం లేదు. దీంతో వారిద్దరి రాజీనామాలను ఆమోదించి, వారి స్థానం లో మరో ఇద్దరి మంత్రులుగా అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నారు.
లభించిన నమాచారాన్ని అనునరించి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే!, అందువలన రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గాలకు చెందిన వారితోనే ఖాళీ అయిన మంత్రుల స్థానా లను భర్తీ చేయాలని జగన్ భావిస్తోన్నట్లు నమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో ఐదుగురు ముఖ్యమంత్రుల్లో ఒక్కరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను పిల్లి నుభాష్ నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తే, ఆ స్థానంలో మరో బీసీ వర్గానికి చెందిన వారికి ఉపముఖ్యమంత్రి హోదాను ఇవ్వా ల్సివుంది. కొత్తగా తీసుకునే మంత్రులకు ఆ అవకాశం కల్పిస్తారా, ప్రస్తుతం ఉన్నవారిలో ఎవ్వరికైనా ఆ హోదా కల్పిస్తారా అనే విషయంలోను చర్చ జరుగుతోంది. లభించిన సమాచారాన్ని అనుసరించి ఎమ్మెల్యే చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, పలాన ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రివదవులు దక్కే అవకాశం ఉంది. మంత్రులశాఖల్లోను స్వల్ప మార్పు లు జరిగే అవకాశం ఉందని సమాచారం. మంత్రి ధర్మాన, బొత్స శాఖలలో మార్పు ఉండే అవకాసం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.