మూడు రోజుల నుంచి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు, విపక్ష ఎమ్మెల్సీలు లొంగక పోవటంతో, ఇక తప్పక, మండలి విషయంలో, వైసీపీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవటానికి రెడీ అవుతుంది. రేపు, మండలి రద్దుకు ముహూర్తం ఫిక్స్ సెహ్సారు. రేపు ఉదయం 09.30కి ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. మండలి రద్దు తీర్మానానికి కేబినేట్ ఆమోదం తెలపనున్నది. మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ విరమించుకుంది. అంతా అనుకున్నట్టు జరిగితే, విపక్ష ఎమ్మెల్సీలను తమ వైపు లాగేసి, మండలి చైర్మెన్ పై అవిస్వాసం పెట్టి, ఆయన్ను దింపి, తమకు ఇష్టమైన వాళ్ళని పెట్టుకుందామని వైసీపీ భావించింది. ఇలా చేసిన తరువాత, సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ కూడా వారం పది రోజుల్లో ఇచ్చే విధంగా ప్లాన్ చేసింది. గురువారం అసెంబ్లీలో చర్చించిన దగ్గర నుంచి, అధికార పార్టీ అనేక బెదిరింపులకు పాల్పడింది. మండలి రద్దు చేస్తున్నాం అంటూ, ముందు విపక్ష ఎమ్మెల్సీలను బెదిరించింది. టిడిపి కాకుండా, పీడీఎఫ్ సభ్యులను కూడా బెదిరించింది.
అయితే ఎవరూ లొంగలేదు. మండలి రద్దు అనైతిక చర్య అని అన్నారు. అలాగే సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చే దాకా ప్రభుత్వం ఆగాలి కదా అని కూడా అన్నారు. ప్రభుత్వం ఏది చేస్తే అది మేము ఆమోదించాలా అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ఆపరేషన్ ఆకర్ష కు తెర లేపారు. అయితే, మూడు రోజుల నుంచి, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, బెదిరింపులు చేసినా, ఎవరూ లొంగలేదని సమాచారం. ఈ రోజు టిడిపి మీటింగ్ పెడితే, 23 మంది వచ్చారు. 5 గురు వివిధ కారణాల వల్ల రాలేమని ముందే చెప్పారు. దీంతో వైసీపీకి క్లారిటీ వచ్చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కాదని తెలిసి పోయింది. దీంతో, వైసీపీ ప్రభుత్వం మండలి రద్దుకే మొగ్గు చూపుతుంది. మండలి రద్దు చేస్తూ, రేపు క్యాబినెట్ తీర్మానం పెట్టి, అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపుతారు.
అయితే, సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఇబ్బంది పడకుండా, జగన్ మరో ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. అదే, జోన్‌ల అభివృద్ధి కమిటీ. మండలిని రద్దు చేసిన తరువాత, జోన్‌ల అభివృద్ధి కమిటీల్లో, నామినేటెడ్ సభ్యుల సంఖ్యను పెంచి వారికి ఎమ్మెల్సీ హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. గత ఎన్నికల్లో టిక్కెట్ లు ఇవ్వలేని వారికి, మండలిలో అవకాసం ఇస్తాం అని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మండలి రద్దు చేస్తూ ఉండటంతో, దానికి ప్రత్యామ్న్యాయం జగన్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మండళ్ల అభివృద్ధి కమిటీల్లో నామినేటెడ్ సభ్యుల సంఖ్యను నాలుగు నుండి 10 లోపు పెంచితే అందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.