ఈ రోజు అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో అంతా జరిగిపోతుంది, మూడు రాజధానుల ప్రకటన జరిగిపోతుంది అంటూ, అందరూ అనుకున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా, క్యాబినెట్ లో, ఈ విషయం పై, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. మధ్యానం రెండు గంటలకు, క్యాబినెట్ లో ఏమి జరిగిందో, మంత్రి పెర్ని నాని చెప్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే, మంత్రి కన్న బాబు మీడియాతో చిట్ చాట్ చేస్తూ, జీఎన్ రావు కమిటీ నివేదిక పై క్యాబినెట్ లో చర్చించామని చెప్పారు. అయితే, మరో కమిటీ అయిన బోస్టన్ కన్సల్టెంట్ కంపెనీ అనే హై పవర్ కమిటీ నివేదిక కూడా రావాల్సి ఉందని, ఆయన చెప్పారు. అంటే దీన్ని బట్టి, రాజధానుల విషయం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కన్నబాబు మాటలను బట్టి అర్ధమవుతుంది. ఎన్ని సార్లు మీడియా అడిగినా, మూడు రాజధానుల పై నిర్ణయం తీసుకున్నాం అని మాత్రం చెప్పకుండా, ఇంకో కమిటీ నివేదిక రావాల్సి ఉంది అని మంత్రి చెప్పటం, ఏ నిర్ణయం తీసుకోలేదు అనే అనుకోవాలి.

cabinet 2712019 2

అయితే పూర్తి వివరాలు, మధ్యానం రెండు గంటలకు, ఐ అండ్ పీఆర్ మంత్రి పేర్ని నాని, బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. అప్పుడు పూర్తీ విషయం తెలిసే అవకాశం ఉంది. రెండు గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో, జీఎన్ రావు కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదిస్తారని, అందరూ అనుకున్నారు. అలాగే, అమరావతి అభివృద్ధి, తిరిగిచ్చే ప్లాట్ల అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని, మరో కమిటీ దీని పై వేస్తారని, వీళ్ళు రైతులతో, చర్చిస్తారని లీకులు ఇచ్చారు. అలాగే సీఆర్డీఏ రద్దు చేస్తారని చెప్పారు. మొత్తానికి, మంత్రి కన్న బాబు మాటలను బట్టి అయితే, ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరో కమిటీ రిపోర్ట్ కోసం చూస్తున్నారని తెలుస్తుంది.

cabinet 2712019 3

అయితే బోస్టన్ కమిటీ వచ్చిన తరువాత, సంక్రాంతి పండుగ వెళ్ళిన తరువాత, అసెంబ్లీ సమావేశం పెట్టి, ఈ విషయం పై చర్చిస్తారని, అఖిల పక్ష సమావేశం పెడతారని, అప్పుడు మళ్ళీ క్యాబినెట్ పెట్టి, అప్పుడు మూడు రాజధానుల పై ప్రకటన చేస్తారని తెలుస్తుంది. అయితే ప్రభుత్వం, అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనకు వెనక్కు తగ్గిందా ? కొంచెం టైం తీసుకుని, అందరినీ లైన్ లో పెట్టి, అప్పుడు మళ్ళీ దీని పై తుది నిర్ణయం ప్రకటిస్తారా అనే అంశం కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మూడు రాజధానుల ప్రకటన తరువాత, వైజాగ్, కర్నూల్ నుంచి కూడా ప్రజల్లో అనూహ్య స్పందన అయితే రాలేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, కొంచెం టైం తీసుకుని, ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ మధ్యానం రెండు గంటలకు, పెర్ని నాని ప్రెస్ మీట్ తో, తెలిసిపోతాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read