కాపు రిజర్వేషన్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది... ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో, దీనికి సంభందించి ఆమోదం తెలిపింది.. జస్టిస్ మంజునాథన్ కమిషన్ పై ఇవాళ క్యాబినెట్ చర్చించింది... బీసీ కమిషన్ పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణాత్మక ప్రకటన చేయనున్నారు... దీనిపై ఒక తీర్మానం చేసి త్వరలో కేంద్రానికి పంపిస్తారు. రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగుమం చేస్తారు... కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసింది. BC(F) గా గుర్తింపు ఇవ్వనుంది...
ఇది రాజకీయపరమైన రిజర్వేషన్ కాదని, విద్య, ఉపాధి రంగాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరనున్నాయి. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీలో శనివారం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు 2014 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. దీన్ని నెరవేర్చాలన్న డిమాండ్ కాపుల నుంచి బలంగా వినిపిస్తోంది. దీంతో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మెన్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు మెంబెర్స్ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రేపు అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించి, ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుని, కేంద్రానికి ఆమోదం కోసం పంపించనుంది...