మొత్తుకున్నారు... పాకులాడారు... పండుగ పూట నాగపూర్ వెళ్లారు... విదేశీ పర్యటన షడ్యుల్ మార్చుకుని మరీ కేంద్ర మంత్రికి ఆవేదన అంతా చెప్పారు... రెండు నెలలు అవుతుంది అయినా కేంద్రం నుంచి స్పందన లేదు... ఇప్పుడు చంద్రబాబు మాటే నిజం అయ్యింది... చంద్రబాబు పడుతున్న తపన, ఇప్పుకైనా కేంద్రానికి అర్ధమవుతుందా ? పోలవరం కాంట్రాక్టర్ విషయంలో, ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్‌స్ట్రాయ్‌ ని మార్చమని చంద్రబాబు ఆరు నెలల నుంచి మొత్తుకున్నారు... కేంద్రం మాత్రం కుదరదు అని చెప్పేసింది... కాని, ఇప్పుడు విషయం మొత్తం తారు మారు అవుతుంది.

polavaram 30122017 2

ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌పై కెనరా బ్యాంకు.. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. ఆ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించాలని, కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని కోరింది. ట్రాన్‌స్ట్రాయ్‌ తమకు రూ.725 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని.. ఈ నెల 22 నాటికి రూ.489 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకు గ్యారంటీ కింద రూ.379 కోట్లే ఉంచిందని కెనరా బ్యాంకు పేర్కొంది. ట్రాన్‌స్ట్రాయ్‌ను దివాలా సంస్థగా ప్రకటిస్తే ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న కాంట్రాక్టు సంస్థకు మున్ముందు బ్యాంకుల నుంచి పరపతి పుట్టే అవకాశమే ఉండదు. అప్పుడు పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ వంటి సంక్లిష్టమైన, అతిముఖ్యమైన కాంక్రీట్‌ పనులు ముందుకు సాగవు. ఇదే జరిగితే ఇక పోలవరం ఎప్పటికి పర్తవుతుందో దేవుడుకే తెలియాలి. ట్రాన్‌స్ట్రాయ్‌ కంపెనీకి సామర్ధ్యం లేక పోయినా, 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం అప్పగించింది... చంద్రబాబు ప్రభుత్వం రాగానే, వీరి సామర్ధ్యం తెలిసి, పోలవరం పనులను ట్రాన్స్‌ట్రాయ్‌తో పాటూ సబ్‌ కాంట్రాక్టు సంస్థలు ఎల్‌ అండ్‌ టీ, బావర్, కెల్లర్, బీకెమ్, ఫూట్జ్‌మీస్టర్, పెంటా సంస్థలకు పనులు అప్పగించి, పనులు పరిగెత్తించారు...

కాంక్రీట్ పనులకు వచ్చే సరికి ట్రాన్స్‌ట్రాయ్‌ సంగతి తెలిసే, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులకు టెండర్లు పిలిచి కొత్త సంస్థకు పనులు అప్పగించాలని భావించారు. టెండర్లను కూడా పిలిచారు. అయితే ఈ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. తాము టెండర్లను ఎందుకు పిలవాల్సి వచ్చిం దో వివరించేందుకు ముఖ్యమంత్రి బృందం ఇటీవల ఢిల్లీలో జలనవరుల మంత్రి నితిన్‌ గడ్కరీనీ కలిసిన సంగతి తెలిసిందే. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ఆర్థికంగా చితికిపోయిందని, కాంక్రీటు పనుల్లో కొంత భాగం కొత్త సంస్థకు అప్పగించాలని గడ్కరీకి ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ట్రాన్‌స్ట్రాయ్‌కు మరో రెండు నెలలు గడువిద్దామని కేంద్ర మంత్రి చెప్పారు. గోదావరికి వరదలు వచ్చేలోపే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు పూర్తిచేయాలని.. లేదంటే ఒక నీటి సంవత్సరం నష్టపోతామని చంద్రబాబు ఎంత చెప్పినా కేంద్రం వినిపించుకోలేదు. దక్షిణ కొరియా పర్యటన సమయంలోనూ గడ్కరీతో ముఖ్యమంత్రి ఈ అంశంపై ఫోన్లో మాట్లాడారు. అయితే గడ్కరీ తన వాదనకే కట్టుబడ్డారు. ఇప్పుడు ఏకంగా, ట్రాన్‌స్ట్రాయ్‌ను దివాలా సంస్థగా ప్రకటిస్తే అప్పుడు కొత్త కాంట్రాక్టుర్ కోసం వెతకాల్సిందే... లేకపోతే కేంద్రం ఇంత జరిగినా, ట్రాన్‌స్ట్రాయ్‌ను మార్చకపోతే, ఇక పోలవరం ఎప్పటికి అవుతుందో, అసలు అవుతుందో లేదో కూడా చెప్పలేం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read