ఉదయం టీవీల్లో స్క్రోలింగ్ చూసాం.. 10 వేల మంది కంటే ఎక్కువ వస్తే బ్యారేజికి ఇబ్బంది, వేరే చోటు చూసుకోండి అని పోలీసులు నోటీసు ఇస్తే, పవన్ సొంత ఛానల్, పవన్ ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కబద్దార్ పోలీస్ అంటూ, ఒక్కొక్క పిల్లోడి తోక ఊపుడులు చూసాం.. కట్ చేస్తే, పవన్ కవాతు అని చెప్పి, కారులో వెళ్ళిపోయాడు. ఇదేంటి అండి కవాతు అని చెప్పి, పాపం అంత మంది ఫాన్స్ ని నడిపిస్తున్నాడు, మరి పవన్ ఎందుకు నడవకుండా కారులో వెళ్ళిపోతున్నాడు. రిసార్ట్ దీక్ష లాగా, ఇప్పుడు కారులో కవాతు చేస్తున్నారా అని విమర్శలు రాగానే, ఇక్కడ మాత్రం పోలీసులు చెప్పారని, పవన్ బుద్ధిగా పాటించారని సమర్ధించుకున్నారు. సరే, ఇది వదిలేద్దాం. ఇక గాల్లో పిడి గుద్దులు గుద్డుతూ పవన్ సాధించింది ఏంటి ?
కవాతు అంటూ హడావిడి చెసి, దానికి త్రివిక్రమ్ చేత డైలాగులు రాపించారు, రామ జోగయ్య శాస్త్రి చేత పాటలు రాపించారు, తమన్ మ్యూజిక్ ఇచ్చాడు, టీజర్ అన్నాడు, ట్రైలర్ అన్నాడు, ఇవన్నీ ట్విట్టర్ లో పవనే పోస్ట్ చేసాడు, చివరకు సినిమా వచ్చే సరికి, మరో అజ్ఞాతవాసి చేసి చూపించాడు. చెప్పింది ఒకటి చేసింది ఒకటి. పవన్ కి ప్రస్తుతం ముగ్గురు టార్గెట్. మూడు బాగా అచ్చు వచ్చే నెంబర్ అనుకుంటా, అందుకే చంద్రబాబు, లోకేష్, చింతమనేని అనే పేర్లు తప్ప, వేరే పేరులే ఆ నోట్లో నుంచి రావటం లేదు. ఇప్పటి వరకు తిట్టినట్టే వీళ్ళను తిట్టాడు. ఇక ఎన్నో జ్ఞాన గుళికలు కూడా వదిలాడు. పంచాయతీ రాజ్ మంత్రి కావాలి అంటే, పంచాయతీలో గెలవకుండా ఎలా అన్నాడు ? మరి నువ్వు ఇప్పటి వరకు ఏం గెలిచావ్ అంటే సమాధానం ఉందా పవన్ ?
ఒక కానిస్టేబుల్ కొడుకు సీఎం కాలేడా? అని పవన్ అడుగుతున్నాడు. టీ అమ్మే వాడు ప్రధాని అయ్యారు పవన్ గారు, దానికి చిత్తశుద్ధి ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఉండాలి, శ్రీకాకుళం ఆపదలో ఉంటే, సంబరాలు చేసుకుంటున్న మిమ్మల్ని, సియం ఎలా చేస్తారు ? మీ అన్న కూడా ఇవే డైలాగ్ లు చెప్పి, అమ్మేశాడు. ఇప్పుడు మీరు. ఇవన్నీ సరే, నక్సల్స్ ని సమర్ధిస్తూ, ఒక ఎమ్మల్యే, ఒక మాజీ ఎమ్మల్యే హత్యలను సమర్ధిస్తున్న నువ్వు, ఏం సందేశం ఇస్తున్నావ్ ? మొన్నటి దాక నా మీద ఐటి రైడ్లు జరిగాయి అని గోల చేసిన నువ్వు, ఇప్పుడు మోడీని ఎదురుస్తున్న చంద్రబాబు పై ఐటి దాడులు చేస్తుంటే, వాటిని సమర్ధిస్తూ, మోడీ భక్తుడుని అని నిరూపించుకున్నావ్. శ్రీకాకుళం తుఫాను మీద ఒక్క మాట లేదు ? ఒక జిల్లా నాశనం అయితే, వారికి కనీస సానుభూతి ప్రకటిద్దాం అనే స్పృహ లేదు. ఇక మోడీ అనే మాట నోట్లో నుంచి వస్తే ఒట్టు. కేంద్రం చేస్తున్న అన్యాయం, విభజన హామీల పై ఒక్క మాట లేదు. జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలో తేల్చిన 73 వేల కోట్ల గురించి ఎక్కడా లేదు. ఇవన్నీ మాట్లాడకుండా, కారులో కవాతు చేసి, లోకేష్, చంద్రబాబు మీద రాజకీయ ఆరోపణలు చేసి, సాధించింది ఏమిటి ?