తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీలో వివక్షనేత నారా చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. ఆయన ఇటీవల హైదారాబాద్ నుంచి ఏపీ రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయంలో చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని స్థానిక న్యాయవాది శ్రీనివాస్ నందిగామ పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదు పై కేసును నమోదు చేసారు. మార్చినెల 22వ తేదిన చంద్రబాబు హైదారాబాదు చేరుకున్నారు. లాక్ డౌన్ ప్రకటనలతో రెండు నెలల దాదాపు అక్కడే చంద్రబాబు ఉన్నారు, లాక్ డౌన్ నాలుగువ విడుతలో నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 25వ తేదిన తన కుమారుడు నారా లోకేష్ కలిసి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గరికపాడు చెక్ పోస్టు దగ్గర నుంచి జగ్గయ్య పేట, కంచికచర్లలలో ఆయనకు టిడిపి కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. దీంతో లాక్ డౌన్ నిబంధనలకువ విరుద్దంగా జనసమీకరణకు చంద్రబాబు కారణమయ్యారని లాయర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
దీంతో ఐపిసి 188 సెక్షను కింద పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసారు. ఏపీలో రాష్ట్రంలో అడుగు పెట్టే నమయంలో ఏపీ, తెలంగాణా సరిహద్దు ప్రాంతంతో పాటు ఏపీలోని పలు చోట్ల లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టులో చంద్రబాబుపై పబ్లిక్ లిటిగేషన్ పిటిషిన్ ఇప్పటికే దాఖలైంది. చంద్రబాబు హైదారాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చే ముందు ఆయన డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి విమానంలో విశాఖకు వెళ్ళడానికి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి సమీపంలోని తన నివాసగృహనికి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు. అయితే విమాన సర్వీసులు లేకపోవడంతో రోడ్డు మార్గన ఆయన తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంలో టిడిపి కార్యకర్తలు పలు కూడళ్ళలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని, చంద్రబాబు స్వయంగా వారిని ప్రోత్సహించారనే అభియోగాలు వైసీపీ చేసింది. అయితే చంద్రబాబు ఎక్కడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించలేదని, ఇది అన్-ప్లాన్డ్ ట్రిప్ అని, చంద్రబాబు కారులోనే ఉండి అభివాదం చేసారని, కార్యకర్తలు మాస్కులు వేసుకునే ఉన్నారని, ఎక్కడికక్కడ వారిని దూరంగా ఉండమని చెప్తూ ముందుకు కదిలారని, టిడిపి అంటుంది.