జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు 2012 నుంచి నడుస్తూనే ఉంది. మరో పక్క రేపు జగన్ మొహన్ రెడ్డి కోర్ట్ పిటీషన్ పై, తీర్పు రానుంది. ప్రతి శుక్రవారం కోర్ట్ కు రావటం ఇబ్బంది అని, తాను వస్తే రాష్ట్ర ఖజానాకు 60 లక్షలు అవుతాయని, అందుకే ప్రతి శుక్రవారం కోర్ట్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటీషన్ వేసారు. దీని పై స్పందించిన సిబిఐ, చాలా ఘాటుగా వాదనలు వినిపించింది. ఇరువురి వాదనలు విన్న సిబిఐ కోర్ట్, నవంబర్ 1 అంటే, రేపు తీర్పు చెప్పనుంది.అయితే ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ ఐఏఎస్ అధికారి సీవీఎస్కే శర్మ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్ కేసు విషయమై, ఇప్పుడు సీవీఎస్కే శర్మ పైన, అలాగే, మరో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన, మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పీవీ రమేశ్ పైన కూడా మరో కేసు తాజాగా నమోదు అవ్వటం, సంచలనంగా మారింది.

case 31102019 2

జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న, మాజీ ఐఏఎస్ అధికారి సీవీఎస్కే శర్మ పై, కోర్ట్ లో వదానల విషమై, ప్రభుత్వం నుంచి న్యాయసహాయం పొందారు. దీనికి గాను, ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లించింది. అయితే సీవీఎస్కే శర్మ తప్పుడు బిల్లులతో లక్షలాది రూపాయలు పొందారంటూ, పీవీ రమణ అనే వ్యక్తి హైదరాబాద్ లోని, సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీగల్ ఒపీనియన్ బిల్లుల విడుదలలో శర్మకు మాజీ సీఎస్ పీకే మహంతి, మాజీ రెవెన్యూ కార్యదర్శి పీవీ రమేశ్ సహకరించారని, అందరూ కలిసి కుట్ర పన్ని, ప్రభుత్వ సొమ్ముకు గండి కొట్టారని, ఫిర్యాదులో పేర్కొన్నారు. పీవీ రమేశ్‌ ఇప్పుడు కూడా, జగన్ ప్రభుత్వంలో, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

case 31102019 3

ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఐఏఎస్‌ ఆఫీసర్లకు, ప్రభుత్వం అప్పట్లో న్యాయ సహాయానికి గాను నిధులు విడుదల చేసింది. అయితే అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉన్న, సీవీఎస్కే శర్మ, ప్రభుత్వానికి న్యాయసహయ బిల్లులు అందచేయడంలో చేతివాటం ప్రదర్శించారని ఆరోపణ. శర్మ తప్పుడు బిల్లులు చూపించి, లక్షల రూపాయల నిధులు విత్ డ్రా చేసారనేది ఆరోపణ. మొత్తం రూ.7,56,460లను శర్మ లీగల్ ఛార్జీలుగా ప్రభుత్వం నుంచి పొందారు. శర్మ పెట్టిన బిల్స్‌ను సరిగా పరిశీలించకుండానే అప్పటి, సీఎస్ పీకే మహంతి బిల్లుపై సంతకం చేశారని, అప్పటి రెవిన్యూ ముఖ్య కార్యదర్శి పీవి రమేష్ నిధులు విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహరంపై కేసు నమోదు చేయాలని కోర్టును పీవీ రమణ ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read