ఎన్440కె వైరస్ వేగంగా ఆంధ్రప్రదేశ్ లో వ్యాప్తి చెందుతుంది అంటూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది తప్పు అంటూ, కర్నూల్ లో చంద్రబాబు పై కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారు అంటూ, ఆయన పై కేసు నమోదు చేసారు. ఈ రోజు కర్నూల్ పోలీసులు హైదరాబాద్ బయలు దేరారని, ఆయనకు నోటీసులు ఇస్తున్నారు అంటూ, ఉదయం నుంచి వార్తలు చెక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పటి వరకు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ఈ వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. చంద్రబాబు పై ఏ స్టేషన్ లో అయితే కేసు పెట్టారో, అదే స్టేషన్ లో, అదే విషయం పై, మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు నమోదు అయ్యింది. ఒక టీవీ డిబేట్ లో మంత్రి సీదిరి అప్పలరాజు, కర్నూలులో ఎన్440కె వైరస్ గురించి అందరూ భయపడేలా చెప్పారని, ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుందని చెప్పారని, తాము అందరూ భయపడి పోయామని, నిన్న చంద్రబాబు పై ఏ కేసు అయితే పెట్టారో, అదే కేసు మంత్రి సీదిరి అప్పలరాజు పై కూడా పెట్టాలి అంటూ, పోతురాజు రవికుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. చంద్రబాబుపై ఎలా కేసు పెట్టారో, ఆయనకు ఎలా నోటీసులు ఇస్తున్నారో, అలాగే మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీంతో ఇప్పుడు కర్నూల్ వన్ టౌన్ పోలీసులు షాక్ తిన్నారు. చంద్రబాబు చెప్పింది నిజమే అనే విధంగా మంత్రి సీదిరి అప్పలరాజు ఒక టీవీ డిబేట్ లో చెప్పారు. చంద్రబాబు చెప్పింది తప్పు అయితే, మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పింది కూడా తప్పే అవుతుంది. చంద్రబాబు పై కేసు పెడితే, మంత్రి సీదిరి అప్పలరాజు పై కూడా కేసు పెట్టాలి. ఒక వేళ పెట్టకుండా, కేవలం చంద్రబాబునే టార్గెట్ చేస్తే, రేపు కోర్టు ఇదే ప్రశ్నిస్తుంది. అప్పుడు పైన ఉన్న జగన్ మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణా రెడ్డికి ఏమి అవ్వదు. మొత్తం కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులకు ఈ వ్యవహారం చుట్టుకుంటుంది. బహుసా అందుకే ఉదయం అనగా చంద్రబాబుకి నోటీసులు అంటూ హడావిడి చేసిన కర్నూల్ పోలీసులు, ఇందుకే ఇప్పటి వరకు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి ఉండరని అంటున్నారు. చంద్రబాబుకి ఇస్తే, ఇటు మంత్రి సీదిరి అప్పలరాజుకు కూడా నోటీసులు ఇచ్చి, అదే కేసు పెట్టాల్సి ఉంటుంది. మరి ఈ వ్యవహారం ఎటు వెళ్తుందో చూడాలి.