ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలపై పెడుతున్న కేసులు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. మొన్నటి దాకా అవినీతి చేసారు అంటూ కేసులు పెట్టారు. వేల కోట్ల అవినీతి అని బ్లూ మీడియాలో ఊదరగొట్టారు. చివరకు రూపాయి కూడా నిరూపించలేక, కోర్టుల్లో చీవాట్లు తిన్నారు. అయినా అక్రమ కేసులు మాత్రం పెడుతూనే ఉన్నారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్లు అవినీతి చేసారని, చివరకు ఆరు రూపాయలు కూడా అవినీతి నిరూపించలేక, వారు పడిన పాట్లు అందరికీ తెలిసిందే. రెండేళ్ళు అయినా రూపాయి అవినీతి కూడా నిరూపించలేకపోయారు. ఇది ఇలా ఉంటే, చివరకు చంద్రబాబు మీద సోషల్ మీడియాలో పెద్దిరెడ్డిని కించ పరుస్తూ పోస్ట్ పెట్టారని, చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రజలను భయపెట్టారు అంటూ కేసులు పెట్టారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు లాంటి నాయకుడి పై, ఇలాంటి కేసులు పెట్టినప్పుడే, వీళ్ళ మైండ్ సెట్ ఏమిటో అర్ధమవుతుంది. తాజాగా టిడిపి నేతల పై పెట్టిన కేసు ఏమిటో తెలిసి, టిడిపి నేతలు షాక్ తిన్నారు. ఇలా కూడా కేసులు పెడతార అని ఆశ్చర్య పోతున్నారు. చంద్రబాబు క-రో-నా వైరస్ లోని ఒక స్ట్రైన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ, ఆయన పై కర్నూల్ లో కేసు పెట్టి, అది వర్క్ అవుట్ అవ్వక పోవటంతో, గుంటూరులో కూడా రెండు కేసులు పెట్టారు.
అయితే ఇదే స్ట్రైన్ విషయం పై, మంత్రి అప్పలరాజు కూడా ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు. అయితే చంద్రబాబు మీద కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ లోనే, టిడిపి కూడా, చంద్రబాబు ది తప్పు అయితే, అప్పల రాజుది కూడా తప్పు అని, ఆయన పై కేసు పెట్టాలని ఫిర్యాదు చేసారు. ఇలా ఫిర్యాదు చేయటానికి నిన్న టిడిపి నేతలు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, మిగతా నేతలు గుంటూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసారు. అయితే ఇక్కడ మంత్రి పై ఎలాంటి కేసు ఫైల్ చేయక పోగా, తిరిగి ఫిర్యాదు చేసిన టిడిపి నేతల పైనే కేసు నమోదు చేయటంతో అందరూ షాక్ తిన్నారు. కేసు పెట్టటానికి కారణం, కరోనా నిబంధనలు ఉల్లంఘించి, గుంపుగా కలిసి టిడిపి నేతలు వచ్చి ఫిర్యాదు చేసారని. అది కూడా ఒక రోజు తరువాత వారి పైనే ఎదురు కేసు పెట్టటంతో, షాక్ అయ్యారు. పోలీసులు తీరు పై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అప్పలరాజు పై ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఇలా ఎదురు కేసులు పెడతామని సంకేతాలు ఇస్తున్నారా అంటూ, టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.