ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మరో కొత్త సంస్కృతి కేసినో. గుడివాడలో, మంత్రి కొడాలి నాని కన్వేషన్ హాల్ లో, నాని నాని అంటూ పాటలు పెట్టుకుని, వైసిపీ జెండాలు పెట్టుకుని, కేసినో నడిపటం, అది రచ్చ రచ్చ అవ్వటం తెలిసిందే. దీని పైన తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. గుడివాడ కేసినో వ్యవహరం చివరకు పార్లమెంట్ వరకు వెళ్ళింది. అయితే కొడాలి నాని మాత్రం, అసలు దానికి నాకు సంబంధం లేదు, నేను పెట్రోల్ పోసుకుని చస్తాను అంటూ, హడావిడి చేసారు. అయితే మరో పక్క వంశీ మాత్రం, ఆ కేసినో పెట్టింది తన మిత్రుడే అని, ముందు నా దగ్గరకు వస్తే, కొడాలి నాని దగ్గరకు తీసుకుని వెళ్లానని, అయితే అసభ్య డాన్స్ లు వేస్తున్నారని తెలియటంతో, వెంటనే కొడాలి నాని ఫోన్ చేసి ఆపించేసాడు అంటూ, వంశీ చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. అయితే ఇది ఇంత పెద్ద రచ్చ అవ్వటం, పార్లమెంట్ వరకు వెళ్ళటం, ప్రజల్లో కూడా ఈ అంశం బాగా వెళ్ళటంతో, ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టానికి, రాష్ట్ర ప్రభుత్వం, దీని పైన ఎంక్వయిరీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, కృష్ణా జిల్లా ఎస్పీ, కేసినో పైన విచారణకు ఆదేశించారు. నూజివీడు డీఎస్పీ అధ్వర్యంలో, దీని పైన విచారణ చేయాలని ఆదేశించారు.

casino 16032022 2

రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అయితే రెండు రోజులు కాస్త, ఇప్పటికి రెండు నెలలు అయినా, ఆ రిపోర్ట్ బయటకు రాలేదు. అయితే దీని పైన ఈ రోజు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. అసెంబ్లీ జరుగుతూ ఉండటంతో, అసెంబ్లీలో కేసినో పై వివరాలు అడిగారు. కేసినో, జూదం గుడివాడలో జరిగినట్టు మీకు తెలుసా ? తెలిస్తే ఏ చర్యలు తీసుకున్నారు ? అంటూ టిడిపి ఎమ్మెల్యేలు, రామానాయుడు, చినరాజప్ప, గోరంట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సహజంగా అయితే దీని పైన సభలోనే సమాధానం ఇవ్వాలి, అయితే టిడిపి సభ్యులు జంగారెడ్డిగూడెం పై ఆందోళన చేస్తూ ఉండటంతో, ప్రశ్నలు అన్నీ చెప్పినట్టే అని సభలో చెప్పి, లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. పది ప్రశ్నలకు, తొమ్మిది ప్రశ్నలకు జవాబు ఉంది కాని, పదో ప్రశ్న అయితే కేసినో పై మాత్రం ప్రభుత్వం జవాబు ఇవ్వలేదు. కనీసం కేసినో పైన ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది అంటే, అక్కడ ఏమి జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read