"తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, రాజకీయ కక్షతో, ఎలా వెంటాడి, వేటాడారో అందరికీ తెలుసు. అధికారం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి"... ఒక అధికారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనే ప్రశ్నకు, ఇది రాష్ట్ర ప్రభుత్వం తరుపున వినిపించిన వాదనలు. క్యాట్ ముందు, ఒక రాష్ట్ర ప్రభుత్వం వినిపించిన వాదన ఇది. రాజకీయ కక్షతో, అధికారులను కూడా ఇబ్బంది పెడతాం అని ప్రభుత్వమే చెప్తుంటే, ఇక మేమేమి చెప్తాం అంటూ, మీరే విన్నారు కదా అంటూ, వైరి పక్షం క్యాట్ కు తెలిపింది. ఈ వాదనతో, అసలు గుట్టు అంతా బయట పడిందని, మీరే నిర్ణయం తీసుకోండి అంటూ క్యాట్ ని కోరారు. వివరాల్లోకి వెళ్తే, ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ ని, ఏపి ప్రభుత్వం సస్పెండ్ చెయ్యటంతో, ఆయన కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ను ఆశ్రయించారు. దీని పై విచారణ చేపట్టిన క్యాట్, రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇది ప్రభుత్వమేనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

cat 25122019 2

అధికారుల పై ఇలాంటి కక్ష సాధింపు పనికిరాదు. ఇదేమి పరిపాలన ? కక్ష సాధింపు ధోరణితో, ఒక ప్రభుత్వం వెళ్ళటం ఏమిటి ? ఒక సీనియర్ అధికారిని సస్పెండ్ చేసి, సిఐడి విచారణ ఆదేశించేంత తప్పు ఏమి చేసారు ? ఈ ప్రభుత్వాన్ని, కొన్ని దుష్టశక్తులు నడిపిస్తున్నాయి. మీ పాలన ఇలాగే ఉంటే, ఇక పాలించటానికి ఏమి మిగలదు, అంటూ క్యాట్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, తీవ్రంగా స్పందించారు. కృష్ణకిశోర్‌ సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన జీవో పై స్టే ని, జనవరి నెలాఖరు వరకు పొడిగించింది. అలాగే ఆయనకు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదని, రెండు వారాల్లోగా అవి కూడా చెల్లించాలని, ప్రభుత్వాని ఆదేశిస్తూ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

cat 25122019 3

"సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇవ్వడానికి పీవీ రమేశ్‌ ఎవరు? చట్టద్ధమైన సంస్థ ఉండగా, ఆ సంస్థ బోర్డు చేయాల్సిన పనిని పీవీ రమేశ్‌ ఎందుకు చేశారు? ఇది సమస్యలు సృష్టిస్తుంది. అధికారం ఉందన్న కారణంగా చలాయించాలంటే కుదరదు. దానికి ఆధారాలు చూపించాలి. " అంటూ క్యాట్ తీవ్రంగా స్పందించింది. అయితే ఈ సందర్భంలో, రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పి.గోవిందరెడ్డి మాట్లాడుతూ, వాళ్ళు అధికారంలో ఉండగా, ఎలా వెంటాడి వేటాడారో, అందరికీ తెలుసు. అధికారం ఎప్పుడు ఒకరికే ఉండదు అంటూ చేసిన వ్యాఖ్యలతో, అందరూ అవాక్కయ్యారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇలా వాదించటం ఏంటి అంటూ షాక్ అయ్యారు. అయితే ఈ సమయంలో, కృష్ణకిశోర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది నీరజ్‌ మల్హోత్రా జోక్యం చేసుకుని, మీరే విన్నారు, ఇక చెప్పటానికి ఏమి లేదు, అసలు విషయం వాళ్ళే చెప్పారు, రాజకీయ కక్షతో చేస్తున్నామని ఒప్పుకున్నారు అంటూ చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read