దేశంలో అసలు ఏమి జరుగుతుందో అర్ధం కావటం లేదు. రోజుకి ఒక వ్యవస్థ సర్వ నాశనం అయిపోతుంది. కోర్ట్ లు, సిబిఐ, ఈడీ, ఆర్బీఐ, సీవీసీ ఇలా అన్నీ నాశనం అయిపోతున్నాయి. నిన్న సుప్రీంలో సీబీఐ డీఐజీ వేసిన పిటిషన్‌లో ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఇవి చూసిన సగటు భారతీయాడు, ఈ దేశానికి ఏమైంది అంటూ తల బాదుకుంటున్నారు. సీబీఐ డీఐజీ మనీశ్‌ కుమార్‌ సిన్హా వెల్లడించిన సంగతులతో పెను సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేంద్ర సహాయమంత్రి హరిభాయ్‌ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోవల్‌, కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ) కేవీ చౌదరి, న్యాయశాఖ కార్యదర్శి సురేశ్‌ చంద్ర, వీళ్ళందరూ కలిసి సర్వ నాశనం చేసారనే విషయం బయటకు వచ్చింది.

garikapati 20112018

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబల్‌, కేంద్ర మంత్రి హరిభాయ్‌, సీవీసీ కేవీ చౌదరిపై ఐపీఎస్‌ అధికారి మనీష్‌ కుమార్‌ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై తాను చేస్తున్న దర్యాప్తులో ఈ ముగ్గురూ జోక్యం చేసుకోవాలని ప్రయత్నించారని వెల్లడించారు. అస్థానాపై కేసు నమోదు చేస్తున్నట్టు ధోబల్‌కు అక్టోబర్‌ 17న సీబీఐ డైరెక్టర్‌ చెప్పారని మనీశ్‌కుమార్‌ ఆరోపించారు. అదేరోజు రాత్రి జాతీయ భద్రతా సలహాదారు ఈ విషయాన్ని రాకేశ్‌ అస్థానాకు చెప్పారని, తనను అరెస్టుచేయకుండా ఉండాలని ధోబల్‌ను రాకేశ్‌ అస్థానా కోరినట్టు ఆరోపించారు. కొన్ని కోట్ల రూపాయలు కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రికి ఈ ఏడాది జూన్‌ తొలిపక్షంలో ముట్టినట్టు మనశ్‌కుమార్‌ తన పిటిషన్లో పొందుపరిచారు. అలోక్‌వర్మను తప్పించిన రోజే తనను కూడా అన్యాయంగా బదిలీ చేశారని వాపోయారు.

garikapati 20112018

ఆలోక్‌ పై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ విచారణ జరుగుతుండగా.. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేశ్‌ చంద్ర ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని, నవంబర్‌ 8న ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి రేఖారాణి పదేపదే సతీశ్‌ సానా కార్యాలయంలో మాట్లాడే ప్రయత్నం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధాన సాక్షి సాన సతీశ్‌ను విచారించినప్పుడు గత నెల 20న తాను చేసిన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పాడని, అదే సందర్భంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్ చౌదరికి ఈ ఏడాది జూన్‌లో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చెప్పారని మనీష్‌‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్రమంత్రికి అహ్మదాబాద్‌ వాసి విపుల్‌ ద్వారా ముడుపు ముట్టినట్టు సాన సతీశ్‌ తనకు చెప్పినట్టు డీఐజీ వెల్లడించారు. సాన సతీశ్‌ వ్యవహారమంతా ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలో లొసుగులన్నీ బయటపడేందుకు కారణమవుతున్నాయని, అంతకుముందు జరిగిన వ్యవహారాలు, పలువురు అధికారుల్లో వివిధ స్థాయిలో జరిపిన అవకతకవకలన్నీ దర్యాప్తు ద్వారా బయటకు వస్తాయని పేర్కొన్నారు. మొయిన్‌ ఖురేషీ కేసులో ఎన్‌ఎస్‌ఏ ధోబల్‌కు సంబంధాలు ఉన్నట్టు పిటిషన్‌లో తెలిపారు. మధ్యవర్తులు మనోజ్‌, సోమేశ్‌లకు ధోబల్‌తో సంబంధాలు ఉన్నట్టు.. రాకేశ్‌ అస్థానా, డీఎస్పీ దేవేందర్‌పై దర్యాప్తులో ధోబల్‌ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా ధోబల్‌ అడ్డుకున్నారని తెలిపారు. కేంద్రమంత్రి, సీవీసీ చౌదరిని ప్రధాన సాక్షి సానా సతీశ్‌ దిల్లీలో కలిశారని వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read