వైఎస్ వివేకా కేసు గత నెలలో పరుగులు పెట్టింది. సిబిఐ దూకుడుతో, ఏ క్షణమైనా పెద్ద తలకాయి అరెస్ట్ అనే ప్రచారం జరిగింది. అదనపు బలగాలను కూడా సిబిఐ అడిగింది అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఏమి అయ్యిందో ఏమో కానీ, ఉన్నట్టు ఉండి సిబిఐ నెమ్మదించింది. ఈ కేసులో సిబిఐ ఇలా వ్యవహరించటం మొదటి సారి కాదు. గతంలో కూడా రెండు మూడు సార్లు సిబిఐ ఇలాగే వ్యవహరించింది. కేసు విషయంలో పరుగులు పెడుతూ, ఏదో జరగబోతుంది అనుకున్న సమయంలో సైలెంట్ అయిపోవటం. ఈ సారి కూడా అదే జరిగింది. గత నెల రోజులుగా, దాదాపుగా 30, 40 స్టేట్మెంట్లు బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ నుంచి కూడా కొంత మంది స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే అందరి వేళ్ళు అవినాష్ రెడ్డి వైపే చూపించాయి. ఆ రోజు ఉదయం అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, గంగి రెడ్డి కలిసి, అక్కడ ఆధారాలు చెరిపి వేసారని, కుట్లు వేయించారని, గుండెపోటు అని ప్రచారం చేయించారని, జగన్ మోహన్ రెడ్డికి కూడా లింక్ ఉందని, ఎంపీ సీటు విషయంలో తేడా వచ్చిందని, ఇలా అనేక అనేక స్టేట్మెంట్లు వచ్చాయి. అయితే అందరూ కూడా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపే వేళ్ళు చూపించి, మొత్తం వాళ్ళ కను సైగల్లోనే జరిగినట్టు చెప్పారు.

viveka 18032022 2

ఈ నేపధ్యంలోనే, అందరూ అవినాష్ రెడ్డి అరెస్ట్ తధ్యం అని భావించారు. దీనికి తోడు దస్తగిరి అనే వ్యక్తి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ తో అవినాష్ రెడ్డి పరిస్థితి మరింత గడ్డు పరిస్థితికి మారింది. అయితే సిబిఐ నుంచి పై అధికారులు వస్తున్నారని, అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తున్నారు అని ప్రచారం జరిగింది. కోర్టు ద్వారా నోటీసులు ఇప్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ, గత రెండు వారాలుగా సిబిఐ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. నోటీసులు లేదు, విచారణ లేదు, ఏమి లేదు. సిబిఐ పైన ఢిల్లీ లెవెల్ లో ఒత్తిడి చేస్తున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. వైసీపీ పార్టీ గత నెలలో ఈ అంశం పై ఒత్తిడికి గురయ్యింది. సజ్జల ఇదే కేసు మీద అవినాష్ రెడ్డిని వెనకేసుకుని వస్తూ, రెండు ప్రెస్ మీట్లు పెట్టారు. చివరకు సునీతను కూడా టార్గెట్ చేసే వరకు వెళ్లారు. మరి సిబిఐ ఇప్పుడు ఏమి చేస్తుంది ? ఇంకా అవినాష్ రెడ్డిని ఎందుకు విచారణకు పిలువలేదు ? మరిన్ని ఆధారాల కోసం చూస్తుందా ? ఏమి జరుగుతుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read