సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణని సీబీఐ మళ్లీ మొదలు పెట్టింది. కడప నుంచి పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీశారు. పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చిన సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీయడంతో ఒక్కసారిగా ఈ కేసులో నిందితులు, అనుమానితుల్లో గుబులు మొదలైంది. పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను కూడా సీబీఐ పరిశీలించడంతో కార్యాలయానికి రాలేదని కార్యకర్తలు చెప్పడంతో సీబీఐ బృందం వెనుదిరిగింది. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని వార్తలు రావడంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఆయన దేశరాజధానిలో పెద్దలు కలిసి వెళ్లొచ్చాక అవినాశ్ రెడ్డి అరెస్టు ఆగిపోవడం యాధృచ్చికమేనా అన్న అనుమానాలు వచ్చాయి. మళ్లీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కోసం సీబీఐ రావడం, అరెస్టు ఊహాగానాలు ఊపందుకోవడంతో వైఎస్ జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లక తప్పకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.
పులివెందుల వచ్చి అవినాష్ రెడ్డి తండ్రి కోసం గాలించిన సిబిఐ... ఆచూకీ లేని వైఎస్ భాస్కర్ రెడ్డి..
Advertisements