ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సిబిఐ వెంటాడుతున్నట్టు ఉంది. తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు సిబిఐ దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారు. 151 సీట్లు వచ్చినా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ బెయిల్ ఎప్పుడు రద్దు చేస్తుందో అనే చర్చ నడుస్తుంది. మరో పక్క బాబాయ్ కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతుంది. దీని పై త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాసం ఉంది. ఇక డాక్టర్ సుధాకర్ కేసు కూడా సిబిఐ ఒక కొలిక్కి తెచ్చింది. ఇక దీంతో పాటు దాదాపుగా వంద మందికి పైగా వైసిపీ శ్రేణులు సిబిఐ కేసులో బుక్ అయ్యింది, జడ్జిల పై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసిన కేసు.ఇప్పుడు ఈ కేసులో సిబిఐ ఆక్టివ్ అయ్యింది. రెండు రోజుల క్రితం, పలువురు పాస్ పోర్ట్ లు సీజ్ చేసిన సిబిఐ, అరెస్ట్ లు వరకు కూడా వెళ్లి, వైసీపీ బ్యాచ్ కు చెమటలు పట్టిస్తుంది. అసలు అధికారంలో ఉన్నామో, ప్రతిపక్షంలో ఉన్నామో అంటూ, వైసీపీ శ్రేణులు బాధపడే పరిస్థితి వచ్చింది. కడప జిల్లా పులివెందులకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సిబిఐ అధికారులు నిన్న అరెస్ట్ చేసారు. వైజాగ్ బ్రాంచ్ సిబిఐ అధికారులు కడపకు వచ్చి, అత్యంత రహస్యంగా వచ్చి, ఎవరికీ తెలియకుండా వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి సిబిఐ అధికారులు తీసుకు వచ్చి, గుంటూరులో నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు.

cbi 11072021 1

అయితే కోర్టు అతనకి, ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. ఇది ఇలా ఉంటే, న్యాయమూర్తుల పై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టిస్తున్న పెద్దలు ఎవరో, లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డికి తెలుసని, పోస్టులు వెనుక ఉద్దేశం, అతని వెనుక ఎవరు ఉన్నది, సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు, మూడు రోజులు కస్టడీ ఇవ్వాలని సిబిఐ కోరింది. అయితే ఈ పిటీషన్ ను కోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. ఇక లింగారెడ్డి రిమాండ్ రిపోర్ట్ లు కొన్ని ఆసక్తికర విషయాలు సిబిఐ నమోదు చేసింది. తన ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ లో ఇంటి పేరు, పుట్టిన రోజు తేదీ వేరు వేరుగా ఉన్నాయని గుర్తించింది. అయితే తన ఫోను వంకలో పడిపోయిందని, మరో ఫోన్ తల్లి దగ్గర ఉందని చెప్పారని, ఫేస్బుక్ తెరవమని కోరగా తన ఎకౌంటు ఆక్టివ్ గా లేదని చెప్పారని, అయితే అది ఆక్టివ్ గానే ఉందని సిబిఐ తెలిపింది. కొన్ని పోస్టు లింకులు డిలీట్ అయినట్టు సిబిఐ తెలిపింది. ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలని కోరగా, అది కుదరలేదని సిబిఐ తెలిపింది. మొత్తం మీద, సిబిఐ ఇప్పుడు ఈ కేసులో, జడ్జిల పై ఈ పోస్టులు పెట్టిస్తున్న పెద్దలు ఎవరో పట్టుకుంటుందో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read